Bigg Boss 5 : ముగ్గురిలో ఎవరు ఎలిమినేషన్ అవుతారో ?

మరో కంటెస్టెంట్ ను బయటకు పంపించనున్నారు. ఈ వారం శ్రీరామచంద్ర, ప్రియాంక, లహరి, మానస్, ప్రియలు నామినేషన్ లో ఉన్నారు. లహరి లేదా ప్రియల్లో ఒకరు బయటకు వెళుతారని తెలుస్తోంది.

Bigg Boss 5 : ముగ్గురిలో ఎవరు ఎలిమినేషన్ అవుతారో ?

Bigboss

Updated On : September 26, 2021 / 6:21 AM IST

Bigg Boss telugu : తెలుగు ప్రేక్షకులను బిగ్ బాస్ 5 అలరిస్తోంది. గత కొన్ని రోజులుగా రియాల్టీ షో ప్రసారమౌతున్న సంగతి తెలిసిందే. వీకెండ్ లో హోస్ట్ నాగార్జున విచ్చేసి…జరుగుతున్న పరిణామాలు, హౌస్ లో ఉన్న వారి తప్పులు, ఇతరత్రా వాటిపై ఆయన చెబుతుంటారు. కానీ..వీకెండ్…సండే వచ్చేటప్పటికీ అందరిలోనూ ఉత్కంఠ పెరిగిపోతుంది. ఎందుకంటే..ప్రతి వారం ఒకరిని ఎలిమినేట్ చేస్తూ వస్తుంటారు.

Read More : Dasara 2021 : జోగులాంబలో శరన్నవరాత్రి వేడుకలు

తాజాగా..మరో కంటెస్టెంట్ ను బయటకు పంపించనున్నారు. ఈ వారం శ్రీరామచంద్ర, ప్రియాంక, లహరి, మానస్, ప్రియలు నామినేషన్ లో ఉన్నారు. వీరిలో మానస్, శ్రీరామ్ లు భారీగా ఓట్లు సాధించి…సేఫ్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రియాంక కూడా ఓట్లు సాధించి…సేఫ్ గా ఉన్నట్లు, ఈ ముగ్గురి మధ్య ఎలాంటి నెగెటివిటీ లేకపోవడంతో ఈ వారం వీరిలో ఒకరు బయటకు పోరని టాక్ వినిపిస్తోంది. లహరి లేదా ప్రియల్లో ఒకరు బయటకు వెళుతారని తెలుస్తోంది. రవి, ప్రియలు చేసిన తప్పులకు లహరి బలి కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. లహరి ఎలిమినేషన్ అవుతుందని సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి.

Read More : IPL 2021 : ఉత్కంఠభరిత పోరులో పంజాబ్ దే విజయం

నామినేషన్ సందర్భంగా…ప్రియా, లహరి, రవి మధ్య జరిగిన రచ్చపై నాగార్జున చర్చ మొదలు పెట్టారు. లహరిని పవర్ రూమ్ లోకి తీసుకెళ్లి…తెరపై అసలు విషయం బయటపెట్టారు. మీరు..మాట్లాడింది..చేసింది తప్పే అంటూ లహరి చేసిన వ్యాఖ్యలకు రవి నిర్ఘాంతపోవాల్సి వచ్చింది. మరోవైపు ప్రియకు నాగ్ క్లాస్ పీకారు. బిగ్ బాస్ లో లింగ బేధం లేదని, ఎవరూ ఎక్కడైనా ఉండొచ్చని అంటూ చెప్పారు నాగ్. రవిని నోటమాట రాకుండా చేశారు.

Read More : Pawan Kalyan : తేజ్ ఇంకా కళ్లు తెరవలేదు-పవన్ కళ్యాణ్

నువ్వు మాట్లాడిన ఇంకో వీడియో ప్లే చేయిస్తా అని నాగార్జున అనే సరికి రవి నోటి నుంచి మాట రాలేదు. బిగ్ బాస్ హౌస్ లో అర్హత లేని వ్యక్తులను డోర్ వెనుకు కొట్టి..ముఖాన తలుపులు వేయాలని నాగ్ సూచించగా…అత్యధిక మంది లోబోపై వేశారు. ప్రస్తుతానికి మానస్, ప్రియ, లహరిల్లో ఒకరు ఎలిమినేషన్ కానున్నారు. మరి ఈ ముగ్గురిలో ఎవరు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వస్తారో తెలియాలంటే..ఆదివారం వరకు వెయిట్ చేయాల్సిందే.