Bigg Boss 7 : ‘నువ్వు కంటెండర్‌వి కాదు. నిన్నెందుకు పిలుస్తారు..’ నాగార్జున ఫైర్
తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ (Bigg Boss) సీజన్ -7 మరో వీకెండ్ ఎపిసోడ్‌కు రెడీ అయ్యింది. ఇందుకు సంబంధించిన ప్రొమో తాజాగా విడుదలైంది. ఈ వారం హౌస్‌లో జరిగిన విషయాలపై హోస్ట్ నాగార్జున మాట్లాడాడు.

Bigg Boss Telugu 7 Day 20 Promo
Bigg Boss 7 Day 20 Promo : తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ (Bigg Boss) సీజన్ -7 మరో వీకెండ్ ఎపిసోడ్‌కు రెడీ అయ్యింది. ఇందుకు సంబంధించిన ప్రొమో తాజాగా విడుదలైంది. ఈ వారం హౌస్‌లో జరిగిన విషయాలపై హోస్ట్ నాగార్జున మాట్లాడాడు. కొందరు కంటెస్టంట్లకు కాస్త గట్టిగానే చెప్పాడు. “నీ కోసం ఆడుతున్నావా..? ప్రియాంక కోసం ఆడుతున్నావా..?” అంటూ అమర్దీప్ ను నాగార్జున ప్రశ్నించాడు. ‘నా కోసమే ఆడుతున్నా’ అంటూ అమర్ దీప్ చెప్పాడు. మరీ అదే విషయం ప్రశాంత్ చెబితే ఎందుకు గోల చేశావ్ అంటూ నాగ్ కడిగిపారేశాడు.
అటు ప్రియాంక, శోభలు కలిసి ప్రిన్స్ యావర్‌ను అనర్హుడిగా ప్రకటించడంపైనా కింగ్ ప్రశ్నల వర్షం కురిపించాడు. అప్పుడు సంచాలకుడిగా ఉన్న సందీప్ ఫెయిల్ అయ్యాడని చెప్పాడు. ఆట మధ్యలో ఇన్వాల్వ్ అవ్వకూడదు. మరీ నువ్వు ఎందుకు పాయింట్లు ఇస్తున్నావ్ అని సందీప్‌ను కాస్త గట్టిగానే అరుచుకున్నాడు. ‘అసలు నువ్వు కంటెండర్ వి కాదు.. నిన్నెందుకు పిలుస్తారు. ఏం అవసరం.. నువ్వు పెద్ద పిస్తావా..?’ అంటూ అసహనం వ్యక్తం చేశాడు నాగార్జున. అంతేకాదు.. సందీప్ బ్యాటరీని డౌన్ చేమమన్నాడు. మరీ సందీప్ ఎలా రియాక్ట్ అయ్యాడు.. యావర్ ఏమన్నా నాగార్జునకు కంప్లైట్ చేస్తాడో లేదో తెలుసుకోవాలంటే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే.