Bigg Boss 7 Telugu : ప్రశాంత్ పేరు జపం చేసిన అశ్విని.. మండిపడ్డ అమర్.. ఈ వారం నామినేషన్స్‌లో ఎవరంటే..?
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7లో విజయవంతంగా ఆరు వారాలు పూర్తి అయ్యాయి. ఏడో వారంలోకి షో అడుగుపెట్టింది.

Bigg Boss Telugu 7 Day 43 promo
Bigg Boss 7 : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7లో విజయవంతంగా ఆరు వారాలు పూర్తి అయ్యాయి. ఏడో వారంలోకి షో అడుగుపెట్టింది. ఆరో వారంలో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన నయని పావలి ఎలిమినేట్ అయ్యింది. ప్రస్తుతం హౌస్‌లో 13 మంది ఉన్నారు. ఇక సోమవారం వచ్చిదంటే చాలు నామినేషన్స్ హీట్ ఉంటుంది అన్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ వారం నామినేషన్స్‌లలో ఎవరెవరు ఉంటారో అని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజాగా నేటి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమో విడుదలైంది. ప్రతి ఒక్కరు ఇద్దరిని నామినేట్ చేయాలని బిగ్‌బాస్ చెప్పాడు. ఎవరిని నామినేషన్ చేయాలని అనుకుంటున్నారో ఆ కంటెస్టెంట్ల ముందు ఉన్న కుండలు పగలకొట్టాలని సూచించాడు. నామినేషన్‌కు తగిన కారణాలు చెప్పాలన్నాడు. ఎప్పటిలాగానే ఈ సారి కూడా నామినేషన్ ప్రక్రియ వాడీవేడీగా సాగినట్లు ప్రొమోను చూస్తే అర్థం అవుతోంది.
Allu Arjun : నేషనల్ అవార్డు అందుకోవడానికి బయలుదేరిన అల్లు అర్జున్.. పిక్స్ వైరల్..!
ఆట సందీప్, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ మధ్య మాటల యుద్ధం నడించింది. సందీప్, అమర్ దీప్‌లను ప్రశాంత్ నామినేట్ చేశాడు. అశ్విని ని అమర్ దీప్ నామినేట్ చేశాడు. ఐదు వారాలు ఉన్నారు గదా ఇక వెళ్లండి అని అశ్విని అంది అని అమర్ చెప్పాడు. అయితే.. తాను అలా అనలేదని అశ్విని అంది. ఈ క్రమంలో అమర్‌ను పదే పదే ప్రశాంత్ అని పిలిచింది. దీంతో అమర్ కాస్త అసహనానికి లోనైయ్యాడు. తన చేతిలోని బ్యాట్ పడేసి పక్కకు వెళ్లిపోయాడు. ఆ తరువాత అశ్వినీ పై పూజా మూర్తి మండిపడింది. శివాజీ హౌస్ వెళ్లిపోవడం ప్రొమోలో కనిపించింది. మరీ ఈ వారం నామినేషన్లలో ఎవరెవరు ఉన్నారో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారం అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.