Bigg Boss 7 : అర్జునా ఇలా చేశావు ఏమిటీ..? నొప్పితో విలవిలలాడిన అశ్వినీ..
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7లో ఎనిమిదవ వారం కొనసాగుతోంది. కెప్టెన్సీ పోటీదారులు అయ్యేందుకు కంటెస్టెంట్లకు బిగ్‌బాస్ పలురకాల టాస్క్‌లు నిర్వహిస్తున్నాడు.

Bigg Boss Telugu 7 Day 53 Promo
Bigg Boss 7 Telugu : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7లో ఎనిమిదవ వారం కొనసాగుతోంది. కెప్టెన్సీ పోటీదారులు అయ్యేందుకు కంటెస్టెంట్లకు బిగ్‌బాస్ పలురకాల టాస్క్‌లు నిర్వహిస్తున్నాడు. ప్రియాంక, పల్లవి ప్రశాంత్‌లు కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌లు గెలిచారు. తాజాగా నేటి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమోను విడుదల చేశారు. ఇందులో అర్జున్, సందీప్, బోలే, అశ్వినీ లు కెప్టెన్సీ పోటీదారులు అయ్యేందుకు పోటీ పడ్డారు. స్పాంజీ హెల్మెట్‌లు ఇచ్చిన బిగ్‌బాస్ వాటిని తలకు పెట్టుకుని సమయానుసారంగా షవర్ నుంచి వచ్చే నీళ్లను స్పాంజీలో పట్టుకోవాలని, తరువాత వాటిని బౌల్‌లో నింపాలని సూచించాడు.
Suriya : దుల్కర్ సల్మాన్‌తో మూవీ అనౌన్స్ చేసిన సూర్య.. మల్టీస్టారర్ చిత్రమా..?
నీళ్లను పట్టుకునే క్రమంలో ఒకరినొకరు తోసుకున్నారు. అర్జున్ మాత్రం ఎవరు వస్తే వాళ్లను రెండు చేతులతో పక్కకు తోసేశాడు. ఈ క్రమంలో అశ్విని కిందపడింది. కాసేపు ఆమె నొప్పితో విలవిలలాడినట్లు కనిపిస్తోంది. పక్కనే ఉన్న శివాజీ వచ్చి ఆమెను పైకి లేపారు. టాస్క్ అనంతరం తేజా, అమర్‌లతో సందీప్ మాట్లాడుతూ.. ఫిజికల్ చేయాలంటే రెండు నిమిషాలు పట్టదని అన్నాడు. పీక పట్టుకుని చాలా సార్లు తోసేశాడని చెప్పాడు. ఆ పిల్లను ఒక్క తోపు తోస్తే వెళ్లిపోయింది అలా అని అన్నాడు. ఇక శివాజీతో అర్జున్.. ఏంటీ మాఫియా మొత్తం వ్యతిరేకమైంది. ఇంతక ముందు నో మాస్టర్ అనేవారు ఇప్పుడు.. మాస్టర్.. మాస్టర్ అంటున్నారు అని అన్నాడు.