Bigg Boss 7 : ప్రిన్స్‌ యావర్‌ను పిచ్చోడు అని అన్న శోభాశెట్టి.. కోపంతో ఊగిపోయాడు

బిగ్‌బాస్ సీజ‌న్ 7లో ఎనిమిద‌వ వారం పూర్తి కావొస్తుంది. త‌దుప‌రి కెప్టెన్ ఎవ‌రు అనే దానిపై అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది.

Bigg Boss 7 : ప్రిన్స్‌ యావర్‌ను పిచ్చోడు అని అన్న శోభాశెట్టి.. కోపంతో ఊగిపోయాడు

Bigg Boss Telugu 7 Day 54 Promo

Updated On : October 27, 2023 / 4:28 PM IST

Bigg Boss 7 Telugu : బిగ్‌బాస్ సీజ‌న్ 7లో ఎనిమిద‌వ వారం పూర్తి కావొస్తుంది. త‌దుప‌రి కెప్టెన్ ఎవ‌రు అనే దానిపై అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది. కెప్టెన్సీ కంటెండ‌ర్లుగా ప్రియాంక‌, ప‌ల్ల‌వి ప్ర‌శాంత్‌, సందీప్‌, గౌత‌మ్ కృష్ణ‌, శోభా శెట్టి లు ఉన్నారు. తాజాగా నేటీ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమో వ‌చ్చేసింది.ఈ మిర్చి చాలా హాట్ అనే టాస్క్‌ను ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఈ ఐదుగురిలో కెప్టెన్సీకి ఎవ‌రు స‌రిపోరు అని మిగిలిన ఇంటి స‌భ్యులు బావిస్తున్నారో వారికి మిర్చి దండ వేయాల‌ని సూచించాడు.

ముందుగా అమ‌ర్ ఆ దండ‌ను ప్ర‌శాంత్ మెడ‌లో వేశాడు. కెప్టెన్సీ అవ‌స‌రం ప్ర‌శాంత్‌కు లేద‌ని, మిగిలిన అంద‌రూ కూడా నామినేష‌న్ల‌లో ఉన్నార‌న్నాడు. అయితే.. త‌న‌కు దండ వేసినంత మాత్రాన మిగిలిన వాళ్లు సేఫ్ అవుతారా అని అమ‌ర్‌ను ప్ర‌శ్నించాడు ప్ర‌శాంత్‌. తేజా కూడా ప్ర‌శాంత్‌కే దండ వేశాడు. ప్రియాంకకు భోలే షావలి దండ వేశారు. ఈ ఇద్ద‌రి మ‌ధ్య కాస్త మాట‌ల యుద్ధం న‌డిచింది. ర‌తిక రోజ్‌, ప్రిన్స్ యావ‌ర్‌లు శోభాశెట్టికి దండ వేశారు.

Arjun Chakravarthy : టాలీవుడ్‌ ఫస్ట్ స్పోర్ట్స్ బయోపిక్.. ఆ కబడ్డీ ప్లేయర్ కథని..

ఈ క్ర‌మంలో ప్రిన్స్ యావ‌ర్‌, శోభాశెట్టికి మ‌ధ్య మాట‌ల యుద్ధ‌మే న‌డిచింది. నా పరిస్థితి నీకు వస్తుంది. అప్పుడు నేను చెబుతా.. చెత్త కార‌ణాలు చెప్ప‌కు అంటూ యావ‌ర్‌తో శోభాశెట్టి అన‌గా.. ఓకే ఇచ్చెయ్ అంటూ యావర్ అన్నారు. ఈ క్ర‌మంలో శోభా ఆగ్ర‌హంతో ఊగిపోయింది. యావర్ ను పిచ్చోడు అంది. పిచ్చోడు అని మళ్లీ మళ్లీ అంటా అని శోభ అర‌వ‌డంతో యావర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. న‌న్ను పిచ్చోడు అంటావా అంటూ శోభ‌పై మండిప‌డ్డాడు. మిర్చి దండను తీసి కింద‌ప‌డేశాడు. వచ్చే వారం కెప్టెన్‍గా ఎవరు ఎంపికయ్యారు తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే.