Bigg Boss 7 Telugu : హౌస్‍లో గ్రూపులు ఉన్నాయ్ సర్.. నవ్వించిన అమరదీప్
Bigg Boss Telugu 7 Day 84 promo : ఆదివారానికి సంబంధించిన ప్రొమో వచ్చేసింది. హౌస్‌లో ఎవరు ఫ్లాప్, ఎవరు హిట్ చెప్పాలని అశ్వినీ ని నాగార్జున అడిగారు.

Bigg Boss Telugu 7 Day 84 promo
బిగ్బాస్ తెలుగు సీజన్ 7 చివరి దశకు వచ్చేసింది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని చెప్పి శనివారం అశ్వినీ ని ఎలిమినేట్ చేశారు. స్టేజ్ పైకి వచ్చింది అశ్వినీ. ఇక ఆదివారానికి సంబంధించిన ప్రొమో వచ్చేసింది. హౌస్‌లో ఎవరు ఫ్లాప్, ఎవరు హిట్ చెప్పాలని అశ్వినీ ని నాగార్జున అడిగారు. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ మాట వినడని ఆమె చెప్పింది. అయితే.. శివాజీలా మిమిక్రీ చేసి చెబితే ఖచ్చితంగా వింటాడని నాగార్జున సరదాగా అన్నారు.
బిగ్‍బాస్ హౌస్‌లో రెండు గ్రూపులు ఉన్నాయన్నారు. ప్రియాంక, శోభ, అమర్ ఈ ముగ్గురు ఒక గ్రూప్, శివాజీ, రతిక, యావర్, ప్రశాంత్ మరో గ్రూపు అని అని అశ్వినీ చెప్పింది. గౌతమ్, తాను ఏకాకిలా మిగిపోయాయని, తనకు ఏం చేయాలో అర్థం కాలేదన్నారు. ఇక ఆదివారం కావడంతో నాగ్ సరదాగా కొన్ని గేమ్స్ పెట్టారు. స్పా బ్యాచ్, స్పై బ్యాచ్ అంటూ రెండు టీమ్స్‌గా విడదీసి నాగార్జున ఆటలు ఆడించారు.
Chiranjeevi : చిరంజీవి పై మన్సూర్ అలీఖాన్ కేసు పెట్టబోతున్నారా..?
కిచెన్ గోడపై ఎన్ని మొక్కలు ఉన్నాయని నాగ్ అడిగిన వెంటనే అటువైపు చూసిన అమర్ సమాధానం చెప్పేశాడు. ఓ ఫోటో చూపించి పాటను గెస్ చేయాలని అన్నారు. ఆ తరువాత సైంటిస్ట్ న్యూటన్ ఫోటోను చూపించగానే.. అమర్ గంట కొట్టాడు. అమర్ చెప్పిన సమాధానం విని అందరూ నవ్వుకున్నారు.