Bigg Boss Telugu 7 : చంద్రముఖిగా శోభా శెట్టి.. బాహుబలిగా అర్జున్.. గజినీలా అమర్‌దీప్
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 ఆఖరి దశకు వచ్చేసింది. 14వ వారం ఆఖరి రోజు నేడు.

Bigg Boss Telugu 7 Day 98 Promo
Bigg Boss Telugu 7 Day 98 Promo : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 ఆఖరి దశకు వచ్చేసింది. 14వ వారం ఆఖరి రోజు నేడు. ఆదివారం రోజు ఎలిమినేషన్ ఉంటుంది అన్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఆట పాటలు ఉంటాయి. ఇక నేటి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమో విడుదలైంది. ట్రెండింగ్‌లో ఉన్న మీమ్స్‌ను కంటెస్టెంట్లకు చూపించారు నాగార్జున. వీటిని చూసిన ఇంటిసభ్యులు బాగా నవ్వుకున్నారు. ఇక ఆ తరువాత చీటీల మీద రాసి ఉన్న పేర్లను సైగతో చెప్పే గేమ్‌ను పెట్టారు.
Bandla Ganesh : ఎన్టీఆర్‌పై నాకు కోపం లేదు.. బండ్ల గణేష్ కామెంట్స్ వైరల్..
సరైన సమాధానం చెప్పిన తరువాత ఆ సినిమా గెటప్‌లో ఇంటిసభ్యులు ఉన్న ఫోటోలు చూపించారు. మొదటగా ‘బాహుబలి’లో ప్రభాస్‌గా అర్జున్ కనిపించాడు. ‘మహానటి’లో సావిత్రిగా ప్రియాంక, ‘చంద్రముఖి’లో జ్యోతికలా శోభ, ‘అపరిచితుడు’లో విక్రమ్‌గా పల్లవి ప్రశాంత్, ‘గజనీ’లో సూర్యగా అమర్ లు సరిగ్గా సరిపోయారు. ఇక చంద్రముఖిగా శోభాశెట్టి అయితే అదుర్స్ అని అంటున్నారు. మొత్తంగా ప్రొమో ఆకట్టుకుంది. ఇక ఈ వారం శోభాశెట్టి ఎలిమినేట్ కానుందని అంటున్నారు. మరి నిజంగానే ఆమెనే ఎలిమినేట్ కానుందా..? లేదా అన్న సంగతి తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు వెయిక తప్పదు.