Bigg Boss 7 : ఈ వారం ఎలిమినేట్ కానుంది ఎవరో తెలుసా..? ట్విస్టులు ఉంటాయట..!
తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ (Bigg Boss) సీజన్-7లో రెండో వారం పూర్తి కావొచ్చింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి రెండో వారంలో ఎవరు ఎలిమినేట్ కానున్నారు అనే దానిపై పడింది.

Bigg Boss 7 Elimination
Bigg Boss 7 : తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ (Bigg Boss) సీజన్-7లో రెండో వారం పూర్తి కావొచ్చింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి రెండో వారంలో ఎవరు ఎలిమినేట్ కానున్నారు అనే దానిపై పడింది. రెండో వారం నామినేషన్‌లో ఏకంగా తొమ్మిది మంది ఉన్నారు. శివాజీ, పల్లవి ప్రశాంత్, రతిక, తేజ, అమర్ దీప్, షకీలా, గౌతమ్ కృష్ణ, శోభా శెట్టి, ప్రిన్స్ యావర్ లు నామినేషన్‌లో ఉండడంతో వీరిలో ఎవరు ఈ వారం బిగ్‌బాస్ హౌస్ ను వీడి వెళ్లనున్నారు అనే ఉత్కంఠ ఏర్పడింది. మొదటి వారం తెలుగు రాని కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.
అయితే.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. అదే సమయంలో మరికొంత మంది సెలబ్రిటీలను హౌస్‌లోకి వైల్డ్ కార్డు ద్వారా పంపించవచ్చునని అంటున్నారు. లేదంటే ఒకరిని ఎలిమినేట్ చేసి మరో కంటెస్టెంట్‌ను సీక్రెట్ రూమ్‌లో ఉంచుతారు అనే టాక్ నడుస్తోంది. ఉల్లా పుల్టా సీజన్ కాబట్టి బిగ్‌బాస్ ఏమైనా చేయొచ్చునని అంటున్నారు. ఏదీఏమైనప్పటికీ మొత్తంగా రెండో వారంలో పెద్ద ట్విస్ట్ ఉండడం ఖాయమట.
Varun Tej : డిజైనర్ మనీష్ మల్హోత్రా షో రూమ్‌లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి.. పెళ్లి షాపింగేనా..!
ఈ వారం నామినేషన్‌లో ఉన్నవారిలో పల్లవి ప్రశాంత్ కు ఎక్కువ ఓట్లు వచ్చాయని, అందరి కంటే తక్కువగా షకీలా, టేస్టీ తేజాలను తక్కువ ఓట్లు వచ్చాయట. ఈ ఇద్దరిలో షకీలా ఎలిమినేట్ కానుందని అంటున్నారు. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ అయితే మాత్రం ఇద్దరు హౌస్ నుంచి బయటికి రావొచ్చునట. ఏదీ ఏమైనప్పటికీ షకీలా ఎలిమినేషన్ మాత్రం పక్కానట.
అడల్ట్ సినిమాల్లో నటించి శృంగార తారగా ముద్ర పడ్డ షకీలా బిగ్‌బాస్ ద్వారా మంచి పేరే సంపాదించుకుంది. తాను సింపుల్‌గా ఉండేందుకే ఇష్టపడతానని చెప్పకనే చెప్పింది. ఎలాంటి గొడవలకు పోలేదు. హౌస్‌లో అందరూ ఆమెను అమ్మ అని పిలుస్తున్న సంగతి తెలిసిందే.