Varun Tej : డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రా షో రూమ్‌లో వరుణ్ తేజ్‌, లావణ్య త్రిపాఠి.. పెళ్లి షాపింగేనా..!

టాలీవుడ్ ప్రేమ ప‌క్షులు మెగాప్రిన్స్ వ‌రుణ్ తేజ్ (Varun Tej), లావ‌ణ్య త్రిపాఠి(Lavanya Tripathi)లు త్వ‌ర‌లోనే పెళ్లి బంధంతో ఒక్క‌టి కానున్న సంగ‌తి తెలిసిందే. గ‌త కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జంట ఈ ఏడాది జూన్ 9న ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు.

Varun Tej : డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రా షో రూమ్‌లో వరుణ్ తేజ్‌, లావణ్య త్రిపాఠి.. పెళ్లి షాపింగేనా..!

Varun Tej-Lavanya Tripathi

Updated On : October 29, 2023 / 11:19 AM IST

Varun Tej-Lavanya Tripathi : టాలీవుడ్ ప్రేమ ప‌క్షులు మెగాప్రిన్స్ వ‌రుణ్ తేజ్ (Varun Tej), లావ‌ణ్య త్రిపాఠి(Lavanya Tripathi)లు త్వ‌ర‌లోనే పెళ్లి బంధంతో ఒక్క‌టి కానున్న సంగ‌తి తెలిసిందే. గ‌త కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జంట ఈ ఏడాది జూన్ 9న ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. మ‌ణికొండ‌లోని నాగ‌బాబు ఇంట్లో నిర్వ‌హించిన ఈ వేడుక‌లో ఇరు కుటుంబాల స‌మ‌క్షంలో వ‌రుణ్, లావ‌ణ్య‌లు ఉంగ‌రాలు మార్చుకున్నారు. ఇక త్వ‌ర‌లోనే వీరిద్ద‌రు పెళ్లిపీట‌లు ఎక్క‌బోతున్నారు. ఈ క్ర‌మంలో పెళ్లి ప్రిప‌రేష‌న్స్ స్టార్ట్ అయిన‌ట్లు తెలుస్తోంది.

హైద‌రాబాద్‌లోని ప్రముఖ డిజైనర్ మనీశ్ మల్హోత్రా షో రూమ్‌లో వ‌రుణ్‌, లావ‌ణ్య‌లు క‌నిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. త‌మ పెళ్లికి సంబంధించిన షాపింగ్ కోసమే వీరిద్ద‌రు అక్క‌డ‌కు వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. న‌వంబ‌ర్ 1న వీరి పెళ్లికి ముహుర్తం ఫిక్స్ అయిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇటలీలోని ఓ ఫ్యాలెస్‌లో వీరి వివాహం జ‌ర‌గ‌నుందని స‌మాచారం.

నాలుగే వేల మైళ్ల దూరంలో ఇరు కుటుంబ పెద్ద‌లు, అత్యంత స‌న్నిహితులు, స్నేహితుల స‌మ‌క్షంలో వీరి వివాహ వేడుక జ‌ర‌గ‌నుందట‌. అయితే.. దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కు అటు మెగా ఫ్యామిలీ, ఇటు లావ‌ణ్య కుటుంబం నుంచి ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న అయితే వెలువ‌డ‌లేదు.

ఆరు సంవ‌త్స‌రాల క్రితం మిస్ట‌ర్ కోసం వ‌రుణ్ తేజ్‌, లావ‌ణ్య త్రిపాఠిలు క‌లిసి న‌టించారు. ఆ స‌మ‌యంలో వీరి మ‌ధ్య ఏర్ప‌డిన స్నేహం క్ర‌మంగా ప్రేమ‌గా మారింది. ఆ త‌రువాత వీరిద్ద‌రూ అంత‌రిక్షం సినిమాలో క‌లిసి న‌టించారు. చాలా కాలంగా వీరిద్ద‌రూ ప్రేమించుకుంటున్న‌ప్ప‌టికీ ఆ విష‌యాన్ని గోప్యంగా ఉంచారు. ఎంగేజ్‌మెంట్ చేసుకున్న త‌రువాత త‌మ ప్రేమ బంధాన్ని వెల్ల‌డించారు.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. వ‌రుణ్‌తేజ్ ఇటీవ‌ల ‘గాంఢీవ‌ధారి అర్జున’ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమా ఆశించిన ఫ‌లితాన్ని అందిచ‌లేదు. వ‌రుణ్ ప్ర‌స్తుతం ‘ఆపరేషన్ వాలెంటైన్’ (Operation Valentine), ‘మట్కా’ (Matka) చిత్రాల్లో నటిస్తున్నాడు. ఆపరేషన్ వాలెంటైన్ షూటింగ్ దాదాపు పూర్తి అయ్యినట్లు సమాచారం. త్వరలోనే మట్కా షూటింగ్ మొదలు పెట్టనున్నాడు.

Bigg Boss 7 : ఒక‌ మొక్క‌ని చూసుకోలేని వాడు రైతు బిడ్డా.. నాగార్జున ఇచ్చి ప‌డేశాడు