Bigg Boss 7 : కొత్త ప్రొమో అదుర్స్.. రాధా రమేశ్.. అంతా ఉల్టా ఫుల్టా..
బిగ్‌బాస్ (BiggBoss) తెలుగు రియాలిటీ షో కు ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ షోను చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

Bigg Boss Telugu 7 Promo
Bigg Boss 7 Promo : బిగ్‌బాస్ (BiggBoss) తెలుగు రియాలిటీ షో కు ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ షోను చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. విజయవంతంగా ఆరు సీజన్లు పూర్తి చేసుకోగా త్వరలోనే 7వ సీజన్ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని తెలియజేయడంతో పాటు ఓ రెండు ప్రోమోలు విడుదల చేసి ఆడియన్స్ కి షో పై ఆసక్తి మరింత పెంచేశారు. తాజాగా మరో ప్రొమోను విడుదల చేసింది బిగ్‌బాస్ బృందం.
Mahesh Babu: భోళా శంకర్ సినిమా విడుదలకు కోర్టులో లైన్ క్లియర్ అవ్వగానే మహేశ్ బాబు ట్వీట్
ఓ ప్రేమ జంట రాధా, రమేశ్. ఇందులో ప్రియుడు రమేశ్ ఓ కొండపై నుంచి పడిపోతుండగా రాధ తన చున్నీ ఇచ్చి పట్టుకోమని చెబుతుంది. అతడు పట్టుకుంటాడు. కాగా.. ఇది కింగ్ నాగార్జున నచ్చలేదు. ఇలాంటి క్లైమాక్స్‌లు మనం ఎన్నో చూశాం. ఇది అంతం కాదు ఆరంభం అంటూ చిటికేస్తాడు. అంతే రాధకు తుమ్ము రావడంతో ఆమె చున్నీని వధిలేస్తుంది. రమేశ్ కొండపై నుంచి కిందకు పడిపోతూ ఉంటాడు. వెంటనే నాగ్.. ఎవ్వరి ఊహకు అందని సీజన్. బిగ్‌బాస్ సీజన్ 7 అంతా ఉల్టా పుల్టా అని చెబుతాడు.
Jailer : ‘జైలర్’పై నెగిటివ్ రివ్యూ.. ఇద్దరిని చితక్కొట్టిన రజనీకాంత్ అభిమానులు..
చూస్తుంటే ఈ సారి సీజన్‌ను సరికొత్తగా ప్లాన్ చేశారని అనిపిస్తోంది. సెప్టెంబర్ 3 ఈ సీజన్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇక సీజన్‌లో ఎవరెవరు సెలబ్రిటీలు వస్తారో, ఎవరు ఇక్కడికి వచ్చి సెలబ్రిటీలు అవుతారో అని ఆడియెన్స్ వెయిట్ చేస్తున్నారు. అమరదీప్ – తేజస్విని జంట, సీరియల్ ఆర్టిస్ట్ శోభిత శెట్టి, జబర్దస్త్ పవిత్ర, ఢీ పండు, జబర్దస్త్ అప్పారావు, ఆట సందీప్, యూట్యూబర్ శ్వేతా నాయుడు, యూట్యూబర్ నిఖిల్, యూట్యూబర్ బ్యాంకాక్ పిల్ల, హీరోయిన్ ఎస్తర్ నోరాన్హా, యాంకర్ శశి, కార్తీకదీపం మోనిత, ప్రభాకర్ తదితరులు షోలో సందడి చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.