Bigg Boss 7 : యావర్ ముఖంపై కోడిగుడ్లతో కొట్టిన రతిక..
మూడో పవర్ అస్త్రా సొంతం చేసుకునేందుకు ముగ్గురు కంటెస్టెంట్లు అమర్ దీప్, శోభాశెట్టి, ప్రిన్స్ యావర్ లను బిగ్‌బాస్ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ప్రిన్స్ యావర్ కంటెడర్ అయ్యేందుకు తాను అర్హుడినేని నిరూపించుకనేందుకు బిగ్‌బాస్ ఓ పరీక్ష పెట్టాడు.

Bigg Boss promo Day 17
Bigg Boss promo Day 17 : మూడో పవర్ అస్త్రా సొంతం చేసుకునేందుకు ముగ్గురు కంటెస్టెంట్లు అమర్ దీప్, శోభాశెట్టి, ప్రిన్స్ యావర్ లను బిగ్‌బాస్ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. దీంతో మిగిలిన వాళ్లు ఫీల్ అయ్యారు. శివాజీ, సందీప్, అమర్ దీప్, శోభాశెట్టి, ప్రిన్స్ యావర్ (Prince Yawar) లు కాకుండా మిగిలిన వారిని కన్ఫెషన్ రూమ్‌కి పిలిచిన బిగ్‌బాస్.. ఎంపికైన ముగ్గురిలో ఎవరు అనర్హులో చెప్పమన్నాడు. వాళ్లు చెప్పిన మాటలు అన్నీ ఇంట్లో వాళ్లకి చూపించాడు బిగ్‌బాస్ (Bigg Boss) నిన్నటి ఎపిసోడ్‌లో.
ప్రిన్స్ యావర్ కంటెడర్ అయ్యేందుకు తాను అర్హుడినేని నిరూపించుకనేందుకు బిగ్‌బాస్ ఓ పరీక్ష పెట్టాడు. ఇంటి సభ్యులు ఏం చేసినా కూడా స్టాండ్ పై ఉంచిన తల తీయకూడదని చెప్పారు. యావర్ స్టాండ్ పై తన తలను పెట్టగా.. రతిక, దామిని, టేస్టీ తేజలు యావర్ పోటీకి అనర్హుడు అని నిరూపించేందుకు తమ ప్రయత్నాలు చేశారు. ప్రిన్స్ ముఖంపై రతిక గుడ్లు కొట్టగా, దామిని అతడి ముక్కులో ఊకలు పెట్టింది. తప్పమ్మా అంటూ శివాజీ అనగా ఇవ్వన్నీ మా ప్రయత్నాలు అంటూ చెప్పుకొచ్చింది దామిని.
Vishal : చంద్రబాబు అరెస్ట్ పై హీరో విశాల్ కామెంట్స్.. భయం కలుగుతోంది అంటూ..
టేస్టీ తేజ ఐస్ తీసుకుని రాగా.. యావర్ ప్యాంట్‌లో వాటిని వేశారు. ఆ తరువాత పేడ నీళ్లను యావర్ తలపై ముఖం పై పోశారు. అయినప్పటికీ యావర్ ఎంతో ఓపికగానే ఉన్నాడు. మరీ అతడు పవర్ అస్త్రా పోటీదారుడుగా నిలవబోతున్నాడా..? లేదా..? అనేది నేటీ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యే వరకు వేచి చూడక తప్పదు.