Bigg Boss 8 : వైల్డ్‌కార్డ్ ఎంట్రీస్‌ త‌రువాత తొలి నామినేష‌న్స్‌.. య‌ష్మి, సీత‌, పృథ్వీ, విష్ణుల‌పై హ‌రితేజ‌, న‌య‌ని పావ‌నిలు గ‌రంగ‌రం

వైల్ కార్డ్ ఎంట్రీ త‌రువాత మొద‌టి నామినేష‌న్ కావ‌డంతో స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

Bigg Boss 8 : వైల్డ్‌కార్డ్ ఎంట్రీస్‌ త‌రువాత తొలి నామినేష‌న్స్‌.. య‌ష్మి, సీత‌, పృథ్వీ, విష్ణుల‌పై హ‌రితేజ‌, న‌య‌ని పావ‌నిలు గ‌రంగ‌రం

Bigg Boss Telugu 8 Day 36 Promo 2 Intense Nomination Drama

Updated On : October 7, 2024 / 1:51 PM IST

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 8లో ఆరో వారం ప్రారంభ‌మైంది. వైల్ కార్డ్ ఎంట్రీస్‌ త‌రువాత మొద‌టి నామినేష‌న్ కావ‌డంతో స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. నేటి ఎపిసోడ్‌కు సంబంధించి రెండో ప్రొమోను విడుద‌ల చేశారు. ఎప్ప‌టిలాగానే సోమ‌వారం నామినేష‌న్స్ ప్ర‌క్రియ‌ను బిగ్‌బాస్ మొద‌లు పెట్టాడు. ఎవ‌రు ఈ ఇంట్లో ఉండ‌డానికి అన‌ర్హులో ముందుగా బోర్డు వేసి ఆ త‌రువాత కార‌ణాల‌ను చెప్పాల‌ని బిగ్‌బాస్ సూచించాడు.

ఇక వైల్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన హ‌రితేజ ముందుగా నామినేష‌న్ ప్ర‌క్రియ‌ను మొద‌లు పెట్టింది. య‌ష్మి మెడ‌లో బోర్డు వేసింది. ప‌ర్స‌న్ ప‌ర్స‌న్‌కు రూల్స్ మారుతున్నాయ‌ని హ‌రితేజ అనింది. నాకు ఏదీ క‌రెక్ట్ అనిపిస్తుందో అదే చేస్తా, నా గేమింగ్‌కు ఎవ‌రు స‌మ‌స్య‌గా ఉన్నారో వాళ్ల‌నే గ‌దా చేయాల‌ని అంటూ య‌ష్మి కాస్త గ‌ట్టిగానే స‌మాధానం ఇచ్చింది.

Akkineni Nagarjuna : నాగార్జున పిటిష‌న్‌ను విచారించిన న్యాయ‌స్థానం..

ఆ త‌రువాత.. నువ్వు నీ గేమ్‌ను ప‌క్క‌న బెట్టి వేరే వ్య‌క్తి మీద కాన్‌స‌న్‌ట్రేట్ చేస్తున్న‌ట్లు చెబుతూ గౌత‌మ్ వ‌చ్చి విష్ణు ప్రియ‌ను నామినేట్ చేశాడు.ఇక న‌య‌నీ పావ‌నీ, విష్ణు ప్రియ‌ల మ‌ధ్య హాట్‌హాట్‌గా డిస్క‌ష‌న్ న‌డిచింది. ఇక హ‌రితేజ‌, పృథ్వీల మ‌ధ్య కూడా వాగ్వాదం జ‌రిగిన‌ట్లుగా క‌నిపిస్తోంది. మొత్తంగా నామినేష‌న్స్ ప్ర‌క్రియ హాట్ హాట్‌గా జ‌రిగిన‌ట్లుగా క‌నిపిస్తోంది.