Akkineni Nagarjuna : నాగార్జున పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం..
తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు అక్కినేని నాగార్జున న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

Nampally Court Hearing on Hero Nagarjuna Petition
Akkineni Nagarjuna : తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు అక్కినేని నాగార్జున న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. నాంపల్లి మనోరంజన్ కోర్టులో నాగార్జున పరువు నష్టం దావా వేశారు. నాగ్ పిటిషన్ పై సోమవారం న్యాయస్థానం విచారణ చేపట్టింది.
నాగార్జున తరపున సీనియర్ కౌన్సిల్ అశోక్ రెడ్డి వాదనలు వినిపించారు. రేపు (మంగళవారం) పిటిషనర్ నాగార్జున స్టేట్‌మెంట్ రికార్డ్ చేస్తామని న్యాయస్థానం తెలిపింది. దీంతో మంగళవారం నాగ్ కోర్టుకు హాజరు కానున్నారు.
Bigg Boss 8 : అడ్డంగా బుక్కైన అవినాశ్..! రోహిణిపై గంగవ్వ పంచ్‌లు
ఇక నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలాలని రేపే నమోదు చేయాలని న్యాయవాది అశోక్ రెడ్డి కోర్టును కోరారు. తదుపరి విచారణను మనోరంజన్ కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.