Bigg Boss 8 : పృథ్వీ క‌ష్ట‌ప‌డ్డాడు.. క‌ష్ట‌ప‌డ్డాడు అంటున్నావ్‌.. న‌బీల్ ఏమ‌న్నా కాళ్లు చాపుకుని కూర్చున్నాడా?

నామినేష‌న్స్ ప్ర‌క్రియ మొత్త పూర్తి కాలేదు.

Bigg Boss 8 : పృథ్వీ క‌ష్ట‌ప‌డ్డాడు.. క‌ష్ట‌ప‌డ్డాడు అంటున్నావ్‌.. న‌బీల్ ఏమ‌న్నా కాళ్లు చాపుకుని కూర్చున్నాడా?

Bigg Boss Telugu 8 Day 37 Promo 1 Unexpected Nomination Twist

Updated On : October 8, 2024 / 11:36 AM IST

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 8 ఆస‌క్తిక‌రంగా సాగుతోంది. వైల్డ్‌కార్డ్ ఎంట్రీస్‌తో అస‌లు మ‌జా మొద‌లైంది. ఈ సీజ‌న్‌లో ప్ర‌స్తుతం ఆరో వారం న‌డుస్తోంది. సోమ‌వారం నామినేష‌న్స్ ప్ర‌క్రియ‌ను ప్రారంభించారు బిగ్‌బాస్. సీత, విష్ణుప్రియను నయని పావ‌ని, యష్మీ, విష్ణుప్రియను గౌతమ్, యష్మీ, పృథ్వీని హరితేజ, యష్మీ, సీతను మెహబూబ్, సీత, మణికంఠను టేస్టీ తేజ లు నామినేట్ చేశారు.

నామినేష‌న్స్ ప్ర‌క్రియ మొత్త పూర్తి కాలేదు. రోహిణి, అవినాష్, గంగవ్వ లు ఇంకా నామినేష‌న్స్ చేయాల్సి ఉంది. ఇక నేటి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమోను విడుద‌ల చేశారు. మొద‌ట‌గా రోహిణి.. య‌ష్మిని నామినేట్ చేసిన‌ట్లుగా క‌నిపిస్తోంది.

Prasanth Varma : మోక్షజ్ఞ సినిమా రాకుండానే.. నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేసిన ప్రశాంత్ వర్మ

పృథ్వీ ఓడిపోయిన‌ప్పుడు ఎందుకు ఏడ్చావు అని య‌ష్మిని ప్ర‌శ్నించింది. నేను ప్రేర‌ణ తీసుకున్న నిర్ణ‌యాన్ని త‌ప్పు అని అన‌లేద‌ని య‌ష్మి అన‌గా.. నువ్వు అన‌లేదు.. త‌న‌ను త‌ప్పు చేయ‌మ‌ని చెప్పావు అంటూ రోహిణి మండిప‌డింది. ఆ త‌రువాత విష్ణు ప్రియ‌ను నామినేట్ చేసింది.

ఇక గంగ‌వ్వ‌.. విష్ణు ప్రియ‌ను నామినేట్ చేసింది. కాళ్లు చేతులు స‌క్క‌గానే ఉన్నాయ్ గ‌దా.. ఎందుకు గేమ్ ఆడ‌డం లేదు అంటూ ఫైర్ అయింది. ఇక అవినాష్‌, పృథ్వీకి మ‌ధ్య వాగ్వాదం న‌డిచింది. ఇక చివ‌రిలో బిగ్‌బాస్ మ‌రో ట్విస్ట్ ఇచ్చాడు. రాయ‌ల్స్ క్లాన్స్ నుంచి ఇద్ద‌రు స‌భ్యుల‌ను నామినేట్ చేయాల‌ని ఓజీ క్లాన్ స‌భ్యుల‌కు సూచించాడు. మ‌రి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన వాళ్ల‌లో ఏ ఇద్ద‌రిని పాత ఇంటిస‌భ్యులు నామినేట్ చేశారో అన్న‌ది చూడాల్సిందే.

Sachana Namidass : తమిళ్ బిగ్ బాస్ లో ఈ అమ్మాయిని గుర్తుపట్టారా..? మహారాజాలో విజయ్ సేతుపతి కూతురు..