Sachana Namidass : తమిళ్ బిగ్ బాస్ లో ఈ అమ్మాయిని గుర్తుపట్టారా..? మహారాజాలో విజయ్ సేతుపతి కూతురు..
ఈసారి మన తెలుగు వాళ్లకు తెలిసిన వాళ్ళు తమిళ్ బిగ్ బాస్ లో ఇద్దరు కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు.

Tamil Bigg boss Season 8 Details Here Sachana Namidass and other 18 Contestants
Sachana Namidass : తెలుగులో బిగ్ బాస్ సీజన్ 8 సాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అయిదు వారాలు అయిపోయి ఆరోవారం సాగుతుంది. ఇక తమిళ్ లో ఇటీవలే బిగ్ బాస్ సీజన్ 8 మొదలైంది. అక్టోబర్ 6 ఆదివారం సాయంత్రం బిగ్ బాస్ తమిళ్ సీజన్ 8 మొదలయింది. ఈసారి కమల్ హాసన్ షూటింగ్స్ తో బిజీగా ఉండటంతో విజయ్ సేతుపతి హోస్టింగ్ చేస్తున్నారు. దీంతో తమిళ్ ఆడియన్స్ కి బిగ్ బాస్ పై మరింత ఆసక్తి నెలకొంది.
ఈసారి మన తెలుగు వాళ్లకు తెలిసిన వాళ్ళు ఇద్దరు కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. మిగిలిన కంటెస్టెంట్స్ కు తెలుగు వాళ్ళతో అంత పరిచయం లేదు. మొత్తం ఈసారి తమిళ్ బిగ్ బాస్ లో.. నిర్మాత రవీంద్ర చంద్రశేఖరన్, సచన నమిదాస్, దర్శ గుప్తా, సత్య, దీపక్, RJ అనంతి, సునీత గొగోయ్, జెఫ్రీ, రంజిత్, పవిత్ర జనని, సౌందర్య, అరుణ్ ప్రశాంత్, తర్షిక, VJ విశాల్, అన్శిదా, అర్ణవ్, ముత్తుకుమారన్, జాక్వెలిన్.. లు పాల్గొంటున్నారు. మొత్తం 18 మంది కంటెస్టెంట్స్ పాల్గొంటున్నారు.
Also Read : Shree Gopika : ఆలయంలో సింపుల్ గా పెళ్లి చేసుకున్న హీరోయిన్.. ఫొటోలు వైరల్..
అయితే వీరిలో లావుగా ఉండే నిర్మాత రవీంద్ర చంద్రశేఖరన్ ఓ సీరియల్ నటిని పెళ్లి చేసుకొని బాగా వైరల్ అయ్యాడు. ఆ తర్వాత పలు వివాదాల్లో కూడా నిలిచాడు. ఇక సచన నమిదాస్ చైల్డ్ ఆర్టిస్ట్ గా అనేక సినిమాల్లో మెప్పించగా ఇటీవల విజయ్ సేతుపతి 50వ సినిమా మహారాజాలో విజయ్ సేతుపతి కూతురిగా నటించి మెప్పించింది. పలు సినిమాల్లో నటిస్తూనే టీవీ షోలలో అలరిస్తున్న సచన నామిదాస్ ఇప్పుడు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
అయితే తాజాగా సచన నామిదాస్ ని ఎలిమినేట్ చేసేసినట్టు చూపించారు. మరి ఎలిమినేట్ చేసారా, సీక్రెట్ రూమ్ లో దాచారా తెలియాలంటే తమిళ్ బిగ్ బాస్ ఎపిసోడ్స్ చూడాల్సిందే.