Bigg Boss 8 : విష్ణు ప్రియ మాట‌ల‌కు క‌న్నీళ్లు పెట్టుకున్న గంగ‌వ్వ‌..

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 8లో ఏడో వారం కొన‌సాగుతోంది.

Bigg Boss 8 : విష్ణు ప్రియ మాట‌ల‌కు క‌న్నీళ్లు పెట్టుకున్న గంగ‌వ్వ‌..

Bigg Boss Telugu 8 Day 45 Promo 1 Full On Masti in BB House

Updated On : October 16, 2024 / 11:58 AM IST

Bigg Boss 8 : బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 8లో ఏడో వారం కొన‌సాగుతోంది. ఈ వారం నామినేష‌న్స్ పూర్తి అయ్యాయి. ఏడో వారంలో 9 మంది గౌతమ్, నిఖిల్, పృథ్వీ, యష్మి, తేజ, నబీల్, నాగ్ మణికంఠ, ప్రేరణ, హరితేజ లు నామినేష‌న్స్‌లో ఉన్నారు. తాజాగా నేటి ఎపిసోడ్ (అక్టోబ‌ర్ 16)కు సంబంధించిన ప్రొమోను విడుద‌ల చేశారు. ఇందులో విష్ణుప్రియ తన తల్లిదండ్రులు వేర్వేరుగా ఉండటం గురించి చెప్పింది. ఈ మాట‌లు విన్న గంగవ్వ కన్నీళ్లు పెట్టుకుంది.

విష్ణుప్రియ ప్రియ మాట్లాడుతూ.. ‘నాన్న ఊరిలో ఉంటారు. ఆయనతో మాట్లాడటం అమ్మకు ఇష్టం లేదు. అమ్మ కోసం నాన్న మీద ఎంత ప్రేమ ఉన్నా, ఎంత మిస్ అయినా కూడా నాన్నతో నేను మాట్లాడలేదు’ అని అంది. దీంతో గంగవ్వ ఎమోషనల్ అయింది. కళ్లలో నీళ్లు వ‌చ్చాయి.

Akhanda 2 : అప్పుడే ‘అఖండ 2’ టైటిల్ థీమ్ కూడా రిలీజ్.. తమన్ తాండవం అదిరిందిగా..

ఆ త‌రువాత గంగ‌వ్వ‌తో మ‌నిద్ద‌రం డీల్ చేసుకుందాం అని మ‌ణికంఠ అడుగుతాడు. ఈ వారం గనక తాను సేవ్ అయితే బంగారు ముక్కు పుడక చేయిస్తానని చెప్పాడు. నాకు బంగారు వడ్డనం ఇస్తావా చెప్పు అని ఆ ప‌క్క‌నే ఉన్న హ‌రితేజ అంది.

మ‌రి నాకు ఏమీ ఇస్తావ్ అని రోహిణి అడుగ‌గా.. ముద్దు ఇస్తాన‌ని అన్నాడు. నువ్వు ఎనిమిదో వారమే ఎలిమినేట్ అయిపోతావ్ అని మ‌ణికంఠ‌తో గంగ‌వ్వ అంది. ఇక ఈ వారం నామినేష‌న్స్ సంద‌ర్భంగా జ‌రిగిన గొడ‌వ‌ల‌పై హౌస్‌మేట్స్ ఇమిటేష‌న్స్ చేశారు.

Bigg Boss 8 : బిగ్ బాస్‌లో కమ్యూనిటీ చర్చ.. మెహబూబ్, నబిల్ పై ఫైర్ అవుతున్న నెటిజన్లు, ఆడియన్స్.. వాళ్ళని పంపేయండి అంటూ..