Bigg Boss Telugu 9: పచ్చళ్ల పాప, దివ్వెల మాధురి వచ్చేశారోచ్.. బిగ్ బాస్ లో ఇక రచ్చరచ్చే.. ఆరుగురు ఎంట్రీ, ఇద్దరు ఎలిమినేట్..
ఈ కొత్త ఎంట్రీలతో బిగ్ బాస్ 9కి కొత్త ఊపు రావడమే కాదు, ఇంట్లో అసలైన రణరంగం మొదలవడం ఖాయంగా కనిపిస్తోంది.

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 రియాలిటీ షో ఉత్కంఠగా సాగుతోంది. ఈ సీజన్ లో ట్విస్ట్ లు మామూలుగా లేవు. ఏ సమయంలో ఎలాంటి మలుపు తిరుగుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఊహించని మలుపులు, నామినేషన్లు, ఎలిమినేషన్లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది సీజన్ 9. తాజాగా ఎంటర్‌టైన్‌మెంట్ డోస్‌ను మరింత పెంచేలా నిర్వాహాకులు ప్లాన్ చేశారు.
బిగ్‌బాస్ తెలుగు సీజన్-9 నుంచి ఈ వారం ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. హౌస్ నుంచి ఫ్లోరా సైనీ, శ్రీజను ఎలిమినేట్ చేసినట్లు షో నిర్వాహకులు ప్రకటించారు. కాగా, హౌస్‌లోకి కొత్తగా ఆరుగురు వచ్చారు. నిఖిల్ నాయర్ (సీరియల్ యాక్టర్), దివ్వెల మాధురి, శ్రీనివాస్ సాయి (గోల్కొండ హైస్కూల్ సినిమా ఫేమ్), రమ్య మోక్ష (అలేఖ్య చిట్టి పికిల్స్), అయేషా (సీరియల్ నటి), గౌరవ్ గుప్తా (సీరియల్ నటుడు) వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు.
ఎవర్ గ్రీన్ సాంగ్‌తో పెర్ఫామెన్స్ ఇచ్చి ఎంట్రీ ఇచ్చారు మాధురి. బిగ్‌బాస్ హౌస్‌లో ఎవరూ యాక్ట్ చేయలేరు.. కొన్నాళ్లు యాక్ట్ చేసినా కచ్చితంగా దొరికిపోతారని మాధురి అన్నారు. తాను ఏంటో అందరికీ తెలియజేయడానికి, తనపై నెగెటివిటీ ఉన్న వాళ్లకి తానేంటో చూపించడానికే బిగ్ బాస్ వచ్చానని ఆమె చెప్పారు.
దివ్వెల మాధురి.. సోషల్ మీడియాలోనే కాదు మొయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ పాపులర్ అయిన పేరు. టెక్కలి నియోజకవర్గం వైసీపీ మ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తో రిలేషన్ కారణంగా మాధురి పేరు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోయింది. అంతకంటే ముందే సోషల్ మీడియాలో రీల్స్ తో కూడా ఫేమస్ అయిందామె.
ఫస్ట్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య మోక్ష హౌస్ లోకి అడుగుపెట్టింది. సోషల్ మీడియా పాపులారిటీ, పికిల్స్ బిజినెస్, ట్రోల్స్.. ఇలా ఆమె న బ్యాక్ గ్రౌండ్ ఏవీని ప్రదర్శించారు. హాట్ హాట్ ఫోజులతో, అందాల ఆరబోతతో.. రీల్స్ ద్వారా ఈమె బాగా పాపులర్ అయ్యింది. ముగ్గురు అక్కా చెల్లెళ్లలో ఒకరైన రమ్య మోక్ష సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయింది. గ్లామర్ షో, అందంతో అట్రాక్ట్ చేసిన రమ్య మోక్ష బిగ్ బాస్ 9 తెలుగులో ఎలా అలరిస్తుందో చూడాలి.
ఈ కొత్త ఎంట్రీలతో బిగ్ బాస్ 9కి కొత్త ఊపు రావడమే కాదు, ఇంట్లో అసలైన రణరంగం మొదలవడం ఖాయంగా కనిపిస్తోంది. కొత్త, పాత కంటెస్టెంట్ల మధ్య గట్టి పోటీ, కాంట్రవర్సీలు మొదలయ్యే అవకాశం ఉంది.