Bigg Boss 8 – Kirrak Seetha : బిగ్ బాస్ సీజన్ 8.. తొమ్మిదో కంటెస్టెంట్.. ‘బేబీ’ ఫేమ్ కిరాక్ సీత..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో తొమ్మిదో కంటెస్టెంట్ గా బేబీ సినిమా ఫేమ్ నటి కిరాక్ సీత ఎంట్రీ ఇచ్చింది.

Bigg Boss Telugu Season 8 Started Ninth Contestant Baby Fame Kirrak Seetha
Bigg Boss 8 – Kirrak Seetha : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఘనంగా ప్రారంభమైంది. నాగార్జున హోస్టింగ్ తో స్వాగతం చెప్తుండగా కంటెస్టెంట్స్ అందరూ గ్రాండ్ గా తమ పర్ఫార్మెన్స్ లతో ఎంట్రీ ఇస్తున్నారు. మొదటి కంటెస్టెంట్ గా సీరియల్ నటి యష్మి గౌడ, రెండో కంటెస్టెంట్ గా సీరియల్ నటుడు నిఖిల్ మలియక్కల్, మూడో కంటెస్టెంట్ గా నటుడు అభయ్ నవీన్, నాలుగో కంటెస్టెంట్ గా నటి ప్రేరణ, ఐదో కంటెస్టెంట్ గా హీరో ఆదిత్య ఓం, ఆరో కంటెస్టెంట్ గా నటి సోనియా ఆకుల, ఏడో కంటెస్టెంట్ గా బెజవాడ బేబక్క, ఎనిమిదో కంటెస్టెంట్ గా ఆర్జే శేఖర్ బాషా రాగా తొమ్మిదో కంటెస్టెంట్ గా నటి కిరాక్ సీత వచ్చింది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో తొమ్మిదో కంటెస్టెంట్ గా బేబీ సినిమా ఫేమ్ నటి కిరాక్ సీత ఎంట్రీ ఇచ్చింది. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన సీత బేబీ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసి బాగా వైరల్ అయింది. బేబీ సినిమాతో కిరాక్ సీతకు మంచి పేరు వచ్చింది. ఇక సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో పాపులర్ అయిన ఈ భామ బిగ్ బాస్ లోకి వచ్చేసింది. బిగ్ బాస్ తన కెరీర్ కి ఎలా ఉపయోగపడుతుందో చూడాలి.