BiggBoss 6 Day 34 : హౌస్ లో హిట్ ఎవరు? ఫ్లాప్ ఎవరు? నామినేషన్స్ నుంచి సేఫ్ అయింది ఎవరు?
బిగ్‌బాస్ లో కొత్త కెప్టెన్సీగా రేవంత్ ఎన్నికైన సంగతి తెలిసిందే. వీకెండ్ కావడంతో నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. కెప్టెన్ గా బాగా పని చేస్తున్నావని రేవంత్ కి కితాబిచ్చారు. కంటెస్టెంట్స్ కూడా రేవంత్ కెప్టెన్సీ గా బాగా పని చేస్తున్నాడని అన్నారు. రేవంత్ మాత్రం..............

BiggBoss 6 Day 34 hit and flop contestants in house
BiggBoss 6 Day 34 : బిగ్‌బాస్ లో కొత్త కెప్టెన్సీగా రేవంత్ ఎన్నికైన సంగతి తెలిసిందే. వీకెండ్ కావడంతో నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. కెప్టెన్ గా బాగా పని చేస్తున్నావని రేవంత్ కి కితాబిచ్చారు. కంటెస్టెంట్స్ కూడా రేవంత్ కెప్టెన్సీ గా బాగా పని చేస్తున్నాడని అన్నారు. రేవంత్ మాత్రం కెప్టెన్సీ చాలా కష్టం అన్నాడు. ఆ తర్వాత ఇంటి సభ్యులని జంటలుగా విడగొట్టి ఎవరు హిట్ ఎవరు ఫ్లాప్ చెప్పాలన్నారు.
ఇద్దరిద్దరిగా హౌస్ లోని సభ్యులని విడగొట్టి బోనులలో నిల్చోబెట్టారు. ముందు వాళ్ళల్లో వాళ్లనే డిసైడ్ అవ్వమన్నారు. ఆ తర్వాత కంటెస్టెంట్స్ ని కూడా ఎవరు హిట్ ఎవరు ఫ్లాప్ చెప్పామన్నారు బిగ్‌బాస్. మొదట సూర్య, ఇనయాలని బోన్ లలో నిలబెట్టగా సూర్య తానూ హిట్ అని, ఇనయా ఫ్లాప్ అని చెప్పాడు. కంటెస్టెంట్స్ కూడా ఇదే అనడంతో సూర్య హిట్ అని తేల్చేసాడు నాగార్జున.
BiggBoss 6 Day 32 : కొత్త కెప్టెన్ కోసం టాస్కులు.. కంటెస్టెంట్ల కోరికలు.. ఎమోషనల్ ఎపిసోడ్..
ఆ తర్వాత బోన్ లోకి ఆదిరెడ్డి, గీతూ వెళ్లగా ఆదిరెడ్డి హిట్ అని చెప్పారు సభ్యులు. చంటి, సుదీప బోన్ లోకి వెళ్లగా చంటి తనని తానే ఫ్లాప్ గా చెప్పుకోవడంతో సుదీప హిట్ అని డిసైడ్ అయిపోయింది. అర్జున్, వాసంతి బోన్ లోకి వెళ్ళగా శ్రీసత్యతో కలిసి ట్రయాంగల్ స్టోరీ గురించి నాగార్జున మాట్లాడటంతో అందరూ నవ్వేశారు. వాసంతి హిట్ అని, అర్జున్ ఫ్లాప్ అని తేల్చేశారు సభ్యులు. ఈసారి శ్రీహన్, శ్రీసత్యని బోన్ లోకి పంపించగా అర్జున్ ని టార్గెట్ చేశారు. గత ఎపిసోడ్స్ లో శ్రీసత్య, శ్రీహన్ కలిసి డ్యాన్స్ చేస్తుండగా అర్జున్ బాధపడిన వీడియోని చూపించి మరింత హంగామా చేశారు. చివరికి రేవంత్ ఒక్కడే మిగలడంతో రేవంత్ కెప్టెన్సీ బాగుందని రేవంత్ హిట్ అని నాగార్జున తేల్చేసాడు.
ఇక ఈ వారం నామినేషన్స్ లో చంటి, బాలాదిత్య, ఫైమా, వాసంతి, అర్జున్, ఇనయ, ఆదిరెడ్డి, మరీనా ఉన్నారు. వీరిలో కొంతమందిని ఈ ఎపిసోడ్ లో సేఫ్ చేశారు. నామినేషన్స్ నుంచి మొదట ఆదిరెడ్డి, ఆ తర్వాత ఫైమా, ఆ తర్వాత బాలాదిత్యని సేఫ్ చేశారు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో నేటి ఎపిసోడ్ లో చూడాలి.