Keerthi Bhat : పిల్లలు పుట్టరని తెలిసినా ఒప్పుకున్నారు.. నటుడితో నిశ్చితార్థం చేసుకున్న బిగ్‌బాస్ భామ.. ఎమోషనల్ అవుతూ..

ఇటీవల కీర్తి ఓ నటుడిని నిశ్చితార్థం చేసుకోగా వీరిద్దరూ ఓ టీవీ షోలోకి వచ్చారు. ఆ టీవీ షోలో వీరు దండలు మార్చుకొని, ఉంగరాలు మార్చుకొని మరోసారి నిశ్చితార్థం చేసుకున్నారు.

Keerthi Bhat :  పిల్లలు పుట్టరని తెలిసినా ఒప్పుకున్నారు.. నటుడితో నిశ్చితార్థం చేసుకున్న బిగ్‌బాస్ భామ.. ఎమోషనల్ అవుతూ..

BiggBoss Fame Keerthi Bhat Engagement with actor Karthek

Updated On : July 4, 2023 / 2:21 PM IST

Keerthi Bhat Engagement :  సీరియల్స్ తో గుర్తింపు తెచ్చుకొని అనంతరం బిగ్‌బాస్‌ షోలోకి ఎంట్రీ ఇచ్చింది కీర్తి భట్. కొన్ని వారాలు బిగ్‌బాస్‌ షోలో ఉండి మంచి ఫేమ్ తెచ్చుకుంది కీర్తి. గతంలో బిగ్‌బాస్‌ లో ఉన్నప్పుడే కీర్తి తన గురించి చెప్పింది. రోడ్డు ప్రమాదంలో కుటుంబం మొత్తాన్ని కోల్పోయిందని, తనకు పిల్లలు పుట్టరని, ఒక పాపని దత్తత తీసుకున్నా తాను కూడా అనారోగ్యంతో మరణించిందని.. ఇలా తన జీవితం అంతా బాధలే అని తెలిపింది కీర్తి భట్.

ఇటీవల కీర్తి ఓ నటుడిని నిశ్చితార్థం చేసుకోగా వీరిద్దరూ ఓ టీవీ షోలోకి వచ్చారు. ఆ టీవీ షోలో వీరు దండలు మార్చుకొని, ఉంగరాలు మార్చుకొని మరోసారి నిశ్చితార్థం చేసుకున్నారు. విజయ్ కార్తిక్ కన్నడలో పలు సినిమాల్లో నటించాడు. తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో నటించాడు. నటుడిగా ప్రస్తుతం సినిమాల్లో మరిన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు విజయ్ కార్తీక్. ఇటీవల విజయ్ కార్తీక్ – కీర్తి భట్ ల నిశ్చితార్థం జరిగింది.

Shahrukh Khan : షూటింగ్‌లో షారుఖ్‌కి ప్రమాదం.. అమెరికాలో సర్జరీ.. ఆందోళనలో అభిమానులు..

తాజాగా ఓ టీవీ షోలో మరోసారి నిశ్చితార్థం చేసుకున్నాక కీర్తి భట్ మాట్లాడుతూ.. నీకు నేను తోడుగా ఉంటా, సపోర్ట్ గా ఉంటా, మీ పేరెంట్స్ ని నా పేరెంట్స్ లా చూసుకుంటా. నన్ను వదలకుండా ఇలాగే చూసుకో అని ఎమోషనల్ అయింది. ఇక తన అత్తామామల గురించి చెప్తూ.. నాకు పిల్లలు పుట్టరని తెలిసినా నన్ను యాక్సెప్ట్ చేశారు. ఇదే విషయాన్ని వాళ్లకు నేను మళ్ళీ చెప్పినా నువ్వే మాకు పాపవి, కావాలంటే ఇంకో పాపని దత్తత తీసుకుందాం అన్నారు అని ఎమోషనల్ గా చెప్తూ ఏడ్చేసింది. దీంతో కీర్తి భట్ అభిమానులు ఆమె ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని కామెంట్స్ చేస్తూ, కొత్త జంటకి కంగ్రాట్స్ చెప్తున్నారు.