డై హార్డ్ ఫ్యాన్స్.. వయలెంట్‌గా ఉన్నారు: థియేటర్లు పగల గొట్టారు.. పోలీసు వాహ‌నాలు త‌గలబెట్టారు

  • Published By: vamsi ,Published On : October 25, 2019 / 04:10 AM IST
డై హార్డ్ ఫ్యాన్స్.. వయలెంట్‌గా ఉన్నారు: థియేటర్లు పగల గొట్టారు.. పోలీసు వాహ‌నాలు త‌గలబెట్టారు

Updated On : October 25, 2019 / 4:10 AM IST

త‌మిళ స్టార్ హీరో, ఇళయదళపతి విజ‌య్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెర‌కెక్కించిన‌ సినిమా బిగిల్. తెలుగులో ఈ సినిమా విజిల్ పేరుతో విడుదలైంది. స్పోర్ట్స్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ సినిమా గ్రాండ్‌గా విడుద‌ల అవగా.. నేప‌థ్యంలో త‌మిళ‌నాట పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొంది. అయితే సినిమా విడుదల విష‌యంలో కొద్ది రోజులుగా రచ్చ అవుతుంది. అయితే ఎట్ట‌కేల‌కి త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం రిలీజ్‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వగా సినిమా విడుదలైంది.

భారీ బడ్జెట్‌తో బిగిల్‌ తెరకెక్కగా బిజినెస్‌ కూడా అదే రేంజ్‌లో జరిగింది. అయితే ప్రత్యేక షోలు పడితేనే బయ్యర్లు కానీ, థియేటర్ల యాజమాన్యం బయటపడే పరిస్ధితి ఉంది. అయితే వారందరికీ షాక్‌ ఇస్తూ ప్రభుత్వం ప్రత్యేక షోలకు అనుమతి నిరాకరించింది. చిత్ర నిర్మాత ఎజీఎస్‌ సంస్థ అధినేత అఘోరం, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ తిరుపూర్‌ సుబ్రమణియన్‌ ప్రత్యేక షోలకు అనుమతివ్వాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో ఉదయం 5గంటలకు షోలు వేసుకునేందుకు అనుమతి ఇచ్చింది.

ఇదిలా ఉంటే రాత్రి స్పెష‌ల్ షో వేయ‌లేద‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు విజ‌య్ అభిమానులు. కొన్ని థియేటర్లను పగలగొట్టారు. థియేటర్ల ముందు ఉన్న షాపుల‌కి నిప్పు పెట్టారు. పోలీస్ వాహ‌నాలు, మున్సిప‌ల్ వాహ‌నాల‌ని కూడా త‌గుల‌పెట్టిన‌ట్టుగా తెలుస్తుంది. ఇదంతా సీసీ కెమెరాలలో రికార్డ్ కాగా, వాటిని ప‌రిశీలించిన పోలీసులు 37 మందిని అరెస్ట్ చేశారు కూడా. త‌మిళ‌నాడు కృష్ణ‌గిరి జిల్లాలో ఇటువంటి ఘటన చోటుచేసుకుంది.