NBK109 : బాలయ్య సినిమాలో విలన్‌గా బాలీవుడ్ నటుడు.. ఈసారి హంటింగ్ గట్టిగా ఉండబోతుంది..
బాలయ్య సినిమాలో విలన్‌గా బాలీవుడ్ నటుడు. రోజురోజుకి స్టార్ కాస్ట్ పెరిగిపోతుందిగా. చూస్తుంటే ఈసారి హంటింగ్ గట్టిగా ఉండబోతుంది.

Bobby Deol is casting for Nandamuri Balakrishna NBK109 movie
NBK109 : నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. NBK109 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో స్టార్ కాస్ట్ కనిపించబోతుంది. ఇప్పటికే ఈ మూవీలో ఇద్దరు మలయాళ స్టార్ యాక్టర్స్ ఎంట్రీ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఈ మూవీలోకి బాలీవుడ్ స్టార్ నటుడు అఫీషియల్ గా ఎంట్రీ ఇచ్చాడు.
ఇటీవల యానిమల్ సినిమాతో తెలుగు ఆడియన్స్ కి పరిచయమైన హిందీ నటుడు ‘బాబీ డియోల్’.. ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర చేయబోతున్నారట. అది విలన్ పాత్ర అని తెలుస్తుంది. తాజాగా ఈ నటుడు మూవీ సెట్స్ లోకి అడుగుపెట్టిన విషయాన్ని చిత్ర యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఇక బాబీ డియోల్ ఎంట్రీతో ఈసారి హంటింగ్ కొంచెం గట్టిగానే ఉండబోతుందని తెలుస్తుంది.
Also read : Pawan Kalyan : వదిన దగ్గర కూడా అప్పు తీసుకున్న పవన్.. ఎలక్షన్ అఫిడవిట్‌లో వివరాలు..
THE HUNTER ENTERS?
Welcome aboard #BobbyDeol garu ?
Your terrific screen presence is set to make our #NBK109 more special for us movie lovers and NBK fans. ❤️?#NandamuriBalakrishna @dirbobby @MusicThaman @thedeol @Vamsi84 @KVijayKartik #SaiSoujanya @chakrif1 @SitharaEnts… pic.twitter.com/sIw8DpjWBF
— Sithara Entertainments (@SitharaEnts) April 23, 2024
కాగా ఈ మూవీలో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ ఒక ముఖ్య పాత్ర చేస్తున్నాడని, అలాగే మరో మలయాళ నటుడు షైన్ టామ్ చాకో ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇక తెలుగు అమ్మాయి ఒక ముఖ్య పాత్ర చేస్తున్నారట. ఇటీవలే ఈ మూవీ నుంచి యాక్షన్ కట్ తో గ్లింప్స్ రిలీజ్ చేసి అదుర్స్ అనిపించారు. దీంతో నందమూరి అభిమానుల్లో ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘వీరమాస్’ అనే టైటిల్ ని ఖరారు చేశారట. త్వరలోనే ఈ టైటిల్ ని అఫీషియల్ అనౌన్స్ చేయనున్నారని టాక్ వినిపిస్తుంది. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.