Hari Hara Veera Mallu : ‘వీరమల్లు’ ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ నటుడు..

భారతీయ సినిమాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న చిత్రాలలో 'హరి హర వీర మల్లు' ఒకటి. పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా ఈ సినిమా మొఘలుల కాలంనాటి కథాంశంతో తెరకెక్కుతుండడంతో, మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్ర కోసం చిత్ర యూనిట్..

Hari Hara Veera Mallu : ‘వీరమల్లు’ ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ నటుడు..

Bobby Deol is on board to Hari Hara Veera Mallu

Updated On : December 24, 2022 / 12:45 PM IST

Hari Hara Veera Mallu : భారతీయ సినిమాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న చిత్రాలలో ‘హరి హర వీర మల్లు’ ఒకటి. పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్‌ పతాకంపై భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ ఇండియా మూవీ గా వస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

Hari Hara Veera Mallu: న్యూ ఇయర్ గిఫ్ట్ రెడీ చేస్తోన్న వీరమల్లు..?

కాగా ఈ సినిమా మొఘలుల కాలంనాటి కథాంశంతో తెరకెక్కుతుండడంతో, మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్ర కోసం చిత్ర యూనిట్.. బాలీవుడ్ నటుడు ‘బాబీ డియోల్’ని పరిశీలిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వాటిని నిజం చేస్తూ, చిత్రీకరణలో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చాడు బాబీ డియోల్. కీలకమైన ఈ షెడ్యూల్ కోసం ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ తోట తరణి 17వ శతాబ్దానికి చెందిన భారీ దర్బార్ సెట్ ను రూపొందించారు. పవన్ కళ్యాణ్, బాబీ డియోల్ మధ్య వచ్చే కీలక సన్నివేశాలను ఈ దర్బార్ సెట్ లో చిత్రీకరించనున్నారు.

ఇక షూటింగ్ లో జాయిన్ అవుతున్న బాబీ డియోల్ కి ఘన స్వాగతం పలుకుతూ హరి హర వీరమల్లు బృందం ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. అందులో ఆయన లుక్ ఆకట్టుకుంటోంది. కాగా ఇటీవలే 40 రోజుల పాటు 900 మంది సిబ్బందితో కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించి భారీ షెడ్యూల్‌ను ముగించారు మేకర్స్. వచ్చే ఏడాది వేసవి విడుదలకు సిద్దమవుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.