Bogan Telugu Trailer: ‘బొమ్మ ఎలా ఉంది’!..

Bogan Telugu Trailer: ‘తని ఒరువన్’ (2015) బ్లాక్ బస్టర్ తర్వాత ‘జయం’ రవి, అరవింద్ స్వామి కలిసి నటించగా సూపర్ హిట్ అయిన చిత్రం ‘బోగన్’. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీని లక్ష్మణ్ డైరెక్ట్ చేశారు. తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా తమిళనాట రూ. 25 కోట్లకు పైగా వసూలు చేయడం విశేషం.
ఇప్పుడు Bogan చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో SRT Entertainments బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి అందిస్తున్నారు. తాజాగా తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఒక బ్యాంక్ దొంగతనం కేసును దర్యాప్తు చేస్తూ, ఆదిత్య అనే నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నించే విక్రమ్ అనే పోలీసాఫీసర్ కథే ‘బోగన్’ చిత్రం.
తనకు చిక్కకుండా తప్పించుకుంటున్న ఆదిత్యను ఒక అద్భుతమైన ప్లాన్‌తో విక్రమ్ పట్టుకోవడం టెర్రిఫిక్ ఇంటర్వెల్ బ్లాక్. ఆ తర్వాత కథ ప్రేక్షకులు ఊహించని మలుపులు తిరిగి, అనుక్షణం కుర్చీలలో మునివేళ్లపై కూర్చోపెట్టేలా కథనం పరుగులు పెడుతుంది. విక్రమ్ ఐపీఎస్‌గా జయం రవి, ఆదిత్యగా అరవింద్ స్వామి ఫెంటాస్టిక్‌గా నటించిన ఈ సినిమా చూస్తుంటే ఒక హాలీవుడ్ థ్రిల్లర్ చూసిన ఫీలింగ్ కలుగుతుందని మేకర్స్ తెలిపారు.
హన్సిక కథానాయికగా నటించిన ఈ చిత్రంలో నాజర్, పొన్‌వణ్ణన్, నరేన్, అక్షర గౌడ ఇతర పాత్రధారులు. డి. ఇమ్మాన్ సంగీతం, సౌందర్ రాజన్ సినిమాటోగ్రాఫీ అందించారు. త్వరలో విడుదల తేది ప్రకటించనున్నారు.