Akshay Kumar : అక్షయ్ కుమార్ తల్లి కన్నుమూత

బాలీవుడ్ అగ్ర నటుడు అక్షయ్ కుమార్ తల్లి అరుణా భాటియా (80) కన్నుమూసారు. గత కొంతకాలంగా ఆమె వృద్దాప్యంలో వచ్చే అనారోగ్యం సమస్యలతో బాధపడుతున్నారు.

Akshay Kumar : అక్షయ్ కుమార్ తల్లి కన్నుమూత

Akshay Kumar

Updated On : September 8, 2021 / 10:26 AM IST

Akshay Kumar : బాలీవుడ్ అగ్ర నటుడు అక్షయ్ కుమార్ తల్లి అరుణా భాటియా (80) కన్నుమూసారు. గత కొంతకాలంగా ఆమె వృద్దాప్యంలో వచ్చే అనారోగ్యం సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కుటుంబ సభ్యులు ముంబైలోని హీరానందని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. గత రెండురోజులుగా ఆరోగ్యపరిస్థితి మరింత విషమించింది. దీంతో బుధవారం ఉదయం కన్నుమూసింది. ఈ విషయాన్నీ అక్షయ్ కుమార్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

కాగా తల్లి ఆరోగ్యపరిస్థితి సరిగాలేకపోవడంతో యూకేలో ‘సిండ్రెల్ల’ షూటింగ్ లో ఉన్న అక్షయ్ కుమార్.. షూటింగ్ నుంచి హుటాహుటిన ముంబై వచ్చారు. గత రెండు వారాల నుంచి అక్షయ్ కుమార్ ‘సిండ్రెల్ల’ షూటింగ్ కోసం లండన్‌లోనే ఉన్నారు. అక్షయ్ కుమార్ తల్లి మరణంపై బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్ సినీ ప్రముఖులు ఆమె మృతిపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు.