Naseeruddin Shah : సౌత్ సినిమాలు హిట్ అవుతాయేమో కానీ.. సౌత్ మూవీస్ పై విమర్శలు చేసిన బాలీవుడ్ స్టార్ నటుడు..
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నసీరుద్దీన్ షా మాట్లాడుతూ.. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో తీసే కమర్షియల్ సినిమాలు హిట్ అవ్వొచ్చు కాని వాటిలో చాలా లాజిక్ లెస్ సీన్స్ ఉంటాయి. సినిమాల్లో ఊహకి అందని....................

Bollywood actor Naseeruddin Shah sensational comments on South Movies goes viral
Naseeruddin Shah : గత సంవత్సర కాలంగా సౌత్ సినిమాలు దేశవ్యాప్తంగానే కాకా ప్రపంచవ్యాప్తంగా మంచి విజయాలు సాధిస్తున్నాయి. ఇదే సమయంలో బాలీవుడ్ వరుస పరాజయాలని చూసింది. సౌత్ సినిమాలు బాలీవుడ్ లో కూడా భారీ విజయాలు సాధించాయి. అక్కడి సినిమాల కంటే ఎక్కువ కలెక్షన్స్ సాధించాయి. దీంతో అంతా బాలీవుడ్ పనైపోయింది అని వ్యాఖ్యానించారు. సౌత్ సినిమాలు సాధిస్తున్న విజయాలు చూసి బాలీవుడ్ ఆశ్చర్యపోయింది.
ఈ క్రమంలో పలువురు బాలీవుడ్ ప్రముఖులు సౌత్ సినిమాల్లో భాగమవుతూ, సౌత్ సినిమా వాళ్ళని తమ సినిమాల్లో భాగం చేసుకుంటుంటే కొంతమంది మాత్రం సౌత్ సినిమాలని ఇంకా విమర్శిస్తున్నారు. గతంలోనే పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు సౌత్ సినిమాలు సక్సెస్ సాధించినా విమర్శించారు. తాజాగా బాలీవుడ్ స్టార్ నటుడు నసీరుద్దీన్ షా సౌత్ సినిమాలపై వ్యాఖ్యలు చేశాడు.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నసీరుద్దీన్ షా మాట్లాడుతూ.. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో తీసే కమర్షియల్ సినిమాలు హిట్ అవ్వొచ్చు కాని వాటిలో చాలా లాజిక్ లెస్ సీన్స్ ఉంటాయి. సినిమాల్లో ఊహకి అందని సీన్స్ ఉంటాయి. పాటలు కూడా మరీ ఊహించని విధంగా అంటాయి. కొన్ని పాటలు పిచ్చిగా కూడా ఉంటాయి. సౌత్ సినిమాలు హిట్ అయినా వాటిల్లో కనీస ఆలోచన ఉండదు, సినిమాలో చాలా తప్పులు కూడా ఉంటాయి అంటూ తీవ్రంగా విమర్శించారు. దీంతో నసీరుద్దీన్ ని సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. మరి నసీరుద్దీన్ వ్యాఖ్యలకు ఎవరైనా సౌత్ యాక్టర్స్ ఎవరైనా కౌంటర్ వేస్తారేమో చూడాలి.