వెంకీ కూతురి పెళ్లిలో సల్మాన్ సందడి

  • Published By: madhu ,Published On : March 23, 2019 / 08:09 AM IST
వెంకీ కూతురి పెళ్లిలో సల్మాన్ సందడి

Updated On : March 23, 2019 / 8:09 AM IST

టాలీవుడ్ విక్టరీ ‘వెంకటేష్’ రియల్‌గా మామ అవుతున్నారు. అవును ఆయన పెద్ద కూతురు అశ్రిత వివాహం రాజస్థాన్‌లోని ఓ ప్రాంతంలో ఘనంగా జరుగుతోంది. పెళ్లి వేడుకలను దగ్గుబాటి ఫ్యామిలీ భారీ స్థాయిలో చేస్తున్నారు. ప్రీ వెడ్డింగ్ వేడుకకు వెంకటేష్ దగ్గరి బంధువులు, సన్నిహితులకు మాత్రమే వెల్ కం ఉందంట. బాలీవుడ్ కండల వీరుడు ‘సల్మాన్ ఖాన్’ వేడుకలో సందడి చేశాడు.
Read Also : మీకు మీరే సాటి : పాల్ చేష్ట‌లు – వ‌ర్మ సెటైర్లు

దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. రాజమౌళి కొడుకు వివాహం కూడా రాజస్ధాన్‌లోనే జరిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ రేస్ క్లబ్ ఓనర్ సురేందర్ రెడ్డి వినాయక్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డి..అశ్రితలు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని తెలుస్తోంది. వీరి వివాహానికి ఇరు ఫ్యామిలీ పెద్దలు ఒకే చెప్పారు. పెళ్లి కంటే ముందుగా నిర్వహించే సంగీత్ వేడుకల్లో ‘రానా దగ్గుబాటి’, ‘నాగ చైతన్య’తో పాటు ‘సమంత అక్కినేని’లు సందడి చేశారంట. 

టాలీవుడ్‌లో సీనియర్ హీరో అయిన ‘వెంకటేష్’ వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ వెళుతున్నారు. యంగ్ హీరోలతో పోటీ పడి నటిస్తూ అభిమానుల అలరిస్తున్నాడు ఈ సీనియర్ హీరో. ఇటీవలే ‘వరుణ్ తేజ’తో కలిసిన నటించిన ‘ఎఫ్ 2’ సినిమా సక్సెస్ కావడంతో ’వెంకటేష్’ సంతోషంగా ఉన్నాడు. మరో చిత్రానికి కూడా ఆయన సైన్ చేశాడు. ‘వెంకీ మామ’ టైటిల్‌తో ఈ సినిమా రూపొందుతోంది. 
Read Also : నా ఎదుగుదలను ఎవరూ అడ్డుకోలేరు : రకుల్‌ ప్రీత్‌సింగ్‌