Sunny Deol: మీకు ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు.. కొంచమైనా సిగ్గనిపించడం లేదా.. మీడియాపై సన్నీ డియోల్ ఆగ్రహం
బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రెండురోజులుగా తన (Sunny Deol)ఇంటిముందు మీడియా చేస్తున్న హడావుడికి సహనాన్ని కోల్పోయిన ఆయన కొంతమైనా సిగ్గుగా లేదా అంటూ మీడియాపై రెచ్చిపోయారు.
Bollywood actor Sunny Deol expressed his anger at the media
Sunny Deol: బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రెండురోజులుగా తన ఇంటిముందు (Sunny Deol)మీడియా చేస్తున్న హడావుడికి సహనాన్ని కోల్పోయిన ఆయన కొంతమైనా సిగ్గుగా లేదా అంటూ మీడియాపై రెచ్చిపోయారు. కొన్ని మాటలు కూడా జారారు. దీనికి సంబందించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే, బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపధ్యంలో ఆయన చనిపోయారు అంటూ మీడియా కథనాలు వచ్చాయి. కానీ, ఆయనకు ఏం అవలేదని, క్షేమంగానే ఉన్నారని ఫ్యామిలీ మెంబర్స్ స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఆయన ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నాడు. ఇక అప్పటినుంచి కవరేజీకి కోసం మీడియా ధర్మేంద్ర ఇంటి చుట్టూనే తిరుగుతున్నారు. అది చూసిన సన్నీ డియోల్ సహనాన్ని కోల్పోయారు. మీడియాపై ఆవేదనతో కూడిన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. “మీకు సిగ్గు అనిపించడం లేదా. మీ ఇంట్లో తల్లితండ్రులు, పిల్లలు ఉన్నారు. కొంచమైనా సిగ్గు పడండి అంటూ నోరు జారాడు సన్నీ. దీంతో ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ సన్నీ డియోల్ కి మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు. ఆవేదనలో ఆ కుటుంబం ఉంటే మీడియా అత్యుత్సాహం ఏంటో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
