Dulquer Salmaan: తెలుగు ప్రేక్షకుల ప్రేమ గొప్పది.. రానా విషయంలో నేను చూశాను.. అడిగి మరీ యాక్టీవ్ అయ్యేలా చేస్తారు..
దుల్కర్ సల్మాన్.. అసలు ఈ నటుడిది మలయాళ ఇండస్ట్రీనా లేక తెలుగు ఇండస్ట్రీనా అర్థం కాదు. (Dulquer Salmaan)ఎందుకంటే, ఈమధ్య కాలంలో ఆయన తెలుగు సినిమాలే ఎక్కువగా చేస్తున్నాడు.
Telugu audience is very great: Dulquer Salmaan
Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్.. అసలు ఈ నటుడిది మలయాళ ఇండస్ట్రీనా లేక తెలుగు ఇండస్ట్రీనా అర్థం కాదు. ఎందుకంటే, ఈమధ్య కాలంలో ఆయన తెలుగు సినిమాలే ఎక్కువగా చేస్తున్నాడు. ఇటీవల ఆయన హీరోగా వచ్చిన లకీ భాస్కర్ సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించింది (Dulquer Salmaan)అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం దుల్కర్ కి మాత్రమే ఉన్న ప్రత్యేకమైన క్వాలిటీ ఏంటంటే, ఆయన ఏ భాషలో అయినా సినిమాలు చేయగలడు. మలయాళ, తమిళ్, తెలుగు, హిందీ ఇలా భాషతో సంబంధం లేకుండా ప్రతీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకొని అసలైన పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు.’
Nagarjuna: మంత్రి కొండా సురేఖపై కేసు విత్‌డ్రా చేసుకున్న నాగార్జున
ప్రస్తుతం ఈ నటుడు హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కాంత. పీరియాడికల్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాను సెల్వమణి సెల్వరాజ్ తెరకెక్కిస్తున్నాడు. సముద్రఖని, రానా, భాగ్యశ్రీ బోర్సే తదితరులు నటిస్తున్న ఈ సినిమా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తెలుగు ప్రేక్షకులపై ప్రశంసల వర్షం కురిపించాడు. “మలయాళ ఇండస్ట్రీలో ఒక నటుడి నుంచి రెండుమూడేళ్ల పాటు సినిమాలు రాకపోతే ఇక ఆ నటుడి పని అయిపొయింది అని, కెరీర్ ముగిసింది అని కామెంట్స్ చేస్తారు.
కానీ, తెలుగులో అలా కాదు. ఒక నటుడు తెఱకై దూరమైతే అతడిని అడిగి మరీ యాక్టీవ్ చేస్తారు. రానా విషయంలో నేను అదే చూశాను. కొంతకాలం సినిమాలకు దూరమైనా రానాను అడిగి మరీ మళ్ళీ సినిమాలు చేసేలా చేశారు. తెలుగువాళ్ళ ప్రేమ అసాధారణం”అంటూ చెప్పుకొచ్చాడు దుల్కర్. దీంతో, ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
