Nagarjuna: మంత్రి కొండా సురేఖపై కేసు విత్‌డ్రా చేసుకున్న నాగార్జున

కొండ సురేఖ పై వేసిన పరువు నష్టం దావా కేసును విత్ డ్రా చేసుకున్న సినీ నటుడు నాగార్జున. (Nagarjuna)ఈ కేసులో నాంపల్లి స్పెషల్ కోర్టు లో విచారణ జరుగగా.. నాగార్జున కేసును విత్ డ్రా చేసుకుంటున్నట్టు తెలిపారు.

Nagarjuna: మంత్రి కొండా సురేఖపై కేసు విత్‌డ్రా చేసుకున్న నాగార్జున

Nagarjuna withdraws defamation case filed against Minister Konda Surekha

Updated On : November 13, 2025 / 7:16 PM IST

Nagarjuna: కొండ సురేఖ పై వేసిన పరువు నష్టం దావా కేసును విత్ డ్రా చేసుకున్న సినీ నటుడు నాగార్జున(Nagarjuna). ఈ కేసులో నాంపల్లి స్పెషల్ కోర్టు లో విచారణ జరుగగా.. నాగార్జున కేసును విత్ డ్రా చేసుకుంటున్నట్టు తెలిపారు. గతంలో అక్కినేని నాగచైతన్య – సమంత విడాకులు అవ్వడానికి కేటీఆర్ కారణం అంటూ కొండ సురేఖ షాకింగ్ కామెంట్స్ చేసింది. 2024 అక్టోబర్ 2వ తేదీన హైదరాబాద్​లోని లంగర్​హౌస్​లో మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ పై విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.

Kajol: పెళ్ళికి ఎక్స్పైరీ డేట్.. కాజల్ షాకింగ్ కామెంట్స్.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్స్

ఈ కామెంట్స్ అటు రాజకీయాల్లో, ఇటు సినీ రంగంలో పెద్ద దుమారమే రేపాయి. దాంతో, తన కుటుంబపరువుకు నష్టం కలిగించేలా మాట్లాడారు అంటూ కొండ సురేఖ పై పరువు నష్టం దావా వేశారు అక్కినేని నాగార్జున. BNS సెక్షన్ 356 కింద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్లో తెలిపారు. ఈ విషయంపై కొండా సురేఖ స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా అక్కినేని కుటుంబానికి ఇప్పటికే రెండు సార్లు క్షమాపణ చెప్పారు కొండ సురేఖ. దీంతో, కొండా సురేఖపై వేసిన పరువు నష్టం దావా కేసును తాజాగా విత్‌డ్రా చేసుకున్నాడు నాగార్జున.