Mumbai : 22 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్న ఆర్టిస్ట్‌ను పెళ్లాడనున్న సల్మాన్ ఖాన్ తమ్ముడు.. ఆమె నేపథ్యం ఏంటంటే..
సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ పెళ్లి పీటలెక్కుతున్నారు. మేకప్ ఆర్టిస్ట్ షురా ఖాన్‌తో డిసెంబర్ 24 న అర్బాజ్ వివాహం జరగనుంది.

Mumbai
Mumbai : బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ మేకప్ ఆర్టిస్ట్ షురా ఖాన్‌ను పెళ్లాడబోతున్నారు. డిసెంబర్ 24 న వీరి వివాహం జరగనుంది. ముంబయిలో కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య ఈ జంట ఒకటి కాబోతున్నట్లు తెలుస్తోంది.
Dunki Review : ‘డంకీ’ మూవీ రివ్యూ.. నవ్వించి.. ఏడిపించేసిన షారుఖ్ ఖాన్..
ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ మేకప్ ఆర్టిస్టు షురా ఖాన్ పెళ్లిపీటలెక్కుతున్నారు. డిసెంబర్ 24 న ముంబయిలో వీరి వివాహం జరగబోతోంది. అర్బాజ్ ఖాన్‌కి ఇది రెండో పెళ్లి. 1998 లో నటి మలైకా అరోరాను పెళ్లాడిన అర్బాజ్ 19 సంవత్సరాల వైవాహిక జీవితానికి బ్రేకప్ చెప్పి 2017 లో విడాకులు తీసుకున్నారు. కాగా ‘పట్నా శుక్లా’ సినిమా షూట్ సమయంలో పరిచయం అయిన షురా ఖాన్‌ను అర్బాజ్ పెళ్లి చేసుకుంటున్నారు.
బిగ్‌బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌కు 14 రోజులు రిమాండ్..
మలైకాతో విడిపోయిన తర్వాత అర్బాజ్ తనకంటే చాలా చిన్నదైన నటి, మోడల్ జార్జియా ఆండ్రియాతో చాలా కాలంగా డేటింగ్‌లో ఉన్నారు. అయితే వీరిద్దరు విడిపోయారు. ఈ విషయాన్ని జార్జియా ధృవీకరించింది. అయితే ప్రస్తుతం అర్బాజ్ పెళ్లి చేసుకుంటున్న షురా ఖాన్ మేకప్ ఆర్టిస్ట్‌గా తెలుస్తోంది. వీరిద్దరికీ కూడా 22 సంవత్సరాల గ్యాప్ ఉందట. కాగా షురా ఖాన్ గతంలో రవీనా టాండన్, ఆమె కుమార్తె రాషా తడాని వద్ద ఆమె పనిచేసింది. వీరిద్దరికీ ‘పట్నా శుక్లా’ మూవీ షూట్‌లో పరిచయం ఏర్పడిందని తెలుస్తోంది.