Hina Khan : బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న బాలీవుడ్ నటి.. ఈ సమయంలో ప్రైవసీ కావాలంటూ..

గత కొన్ని రోజులుగా హీనా ఖాన్ క్యాన్సర్ బారిన పడిందని బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. తాజాగా నటి హీనా ఖాన్ దీనిపై స్పందిస్తూ తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది.

Hina Khan : బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న బాలీవుడ్ నటి.. ఈ సమయంలో ప్రైవసీ కావాలంటూ..

Bollywood Actress Hina Khan Effected with Cancer says in her Social Media Post goes Viral

Updated On : June 29, 2024 / 10:02 AM IST

Hina Khan : పలువురు సెలబ్రిటీలు క్యాన్సర్ బారిన పడి పోరాడి బయటకి వచ్చినవాళ్లు ఉన్నారు. అయితే తాజాగా బాలీవుడ్ సీనియర్ నటి బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడింది. టీవీ సీరియల్స్ తో పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన హీనా ఖాన్ ఆ తర్వాత టీవీ సీరియల్స్, సినిమాలు, వెబ్ సిరీస్ లతో బాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు కూడా హీనా ఖాన్ సినిమాలు, టీవీ షోలతో అలరిస్తుంది.

గత కొన్ని రోజులుగా హీనా ఖాన్ క్యాన్సర్ బారిన పడిందని బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. తాజాగా నటి హీనా ఖాన్ దీనిపై స్పందిస్తూ తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది.

Also Read : Kamal Haasan : పార్ట్ 2లో ఎక్కువ సేపు కనిపిస్తాను.. పార్ట్ 3 కూడా.. కల్కి సినిమాపై కమల్ హాసన్ వ్యాఖ్యలు..

హీనా ఖాన్ తన పోస్ట్ లో.. ఇటీవల నా గురించి వినిపించే రూమర్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. నా అభిమానులు, నాపై ప్రేమ చూపించే వారందరి కోసం చెప్పాలి అనుకుంటున్నాను. నేను స్టేజ్ 3 బ్రెస్ట్ క్యాన్సర్ తో పోరాడుతున్నాను. నేను ప్రస్తుతానికి చాలా స్ట్రాంగ్ గానే ఉన్నాను, చికిత్స తీసుకుంటున్నాను. నేను పూర్తిగా దీని నుంచి బయటపడి రావడం కోసం ఏదైనా చేస్తాను. ప్రస్తుతం ట్రీట్మెంట్ జరుగుతుంది. ఈ సమయంలో నేను కొంచెం ప్రైవసీ కోరుకుంటున్నాను. మీరిచ్చే సూచనలు, సలహాలు, ప్రేమకు ధన్యవాదాలు. నా ఫ్యామిలీ, నాకు సపోర్ట్ చేసే వారితో నేను దీని నుంచి బయటపడి త్వరగా కోలుకొని మరింత స్ట్రాంగ్ గా వస్తాను అని తెలిపింది. దీంతో హీనా ఖాన్ పోస్ట్ వైరల్ అవ్వగా ఆమె త్వరగా కోలుకోవాలని పలువురు బాలీవుడ్ ప్రముఖులు, ఆమె అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by ???? ???? (@realhinakhan)