Pasoori Song : పాకిస్తాన్ పాటని రీమేక్ చేసిన బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర‍్యన్.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్!
గత ఏడాది గ్లోబల్ హిట్టుగా నిలిచిన పాకిస్థానీ సాంగ్ 'పసూరి'ని కార్తిక్ ఆర్యన్ తన కొత్త సినిమా 'సత్యప్రేమ్ కీ కథ' కోసం రీమేక్ చేశాడు. ఇక ఈ పాట పై బాలీవుడ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

Bollywood fans fire on Kartik Aaryan Pasoori Song remake
Kartik Aaryan – Pasoori Song : బాలీవుడ్ (Bollywood) హీరోలు, మేకర్స్ అక్కడి ఆడియన్స్ నుంచి గత కొంతకాలంగా భారీ వ్యతిరేకతను ఎదురుకుంటున్నారు. ఒకప్పుడు తమ సినిమాలతో, పాటలతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో టాప్ ప్లేస్ ని సొంతం చేసుకున్న బాలీవుడ్.. ఇప్పుడు కథలు లేక సౌత్ సినిమాల పై ఆధార పడుతుంది. కుదిరితే బయోపిక్ లు చేయడం లేదంటే సౌత్ సినిమాలను రీమేక్ చేయడం తప్ప సొంత కథలతో వచ్చి హిట్ అందుకోలేక పోతున్నారు. అయితే ఆ రీమేక్ లను కూడా సరిగ్గా హ్యాండిల్ చేయలేక వాటితో కూడా భారీ పరాజయాన్ని అందుకుంటున్నారు.
Varun Tej : VT13ని శరవేగంగా పూర్తి చేస్తున్న వరుణ్.. టైటిల్ అనౌన్స్‌మెంట్.. పెళ్ళికి ముందే..!
అలా రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన రీమేక్ చిత్రాలు సల్మాన్ – ‘కిసీకి భాయ్ కిసీకి జాన్’, కార్తీక్ ఆర్యన్ – ‘షెహజాదా’. తమిళ్ మూవీ ‘వీరం’కి రీమేక్ గా సల్మాన్ మూవీ వస్తే, ‘అల వైకుంఠపురములో’ సినిమాకి రీమేక్ గా కార్తీక్ సినిమా వచ్చింది. ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయ్యాయి. కాగా బాలీవుడ్.. సౌత్ సినిమాలతో పాటు గతంలో కొన్ని సౌత్ సాంగ్స్ ని కూడా రీమేక్ చేసిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఒక పాకిస్తానీ సాంగ్ ని రీమేక్ చేసి విమర్శలు ఎదురుకుంటున్నారు.
Kamal Haasan : ఉద్యోగం కోల్పోయిన తొలి మహిళా డ్రైవర్‌కి కమల్ హాసన్ సాయం.. ఏమి చేశాడో తెలుసా..?
గత ఏడాది గ్లోబల్ హిట్టుగా నిలిచిన పాకిస్థానీ సాంగ్ ‘పసూరి’ని.. కార్తిక్ ఆర్యన్ తన కొత్త సినిమా ‘సత్యప్రేమ్ కీ కథ’ కోసం రీమేక్ చేశాడు. రీసెంట్ గా ఈ పాటని రిలీజ్ చేయగా బాలీవుడ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. “ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ సౌత్ దర్శకులు, మ్యూజిక్ డైరెక్టర్స్ డామినేషన్ కనిపిస్తుంటే.. మీరు ఇంకా రీమక్స్ చేసుకుంటూ వస్తున్నారు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.