Kamal Haasan : ఉద్యోగం కోల్పోయిన తొలి మహిళా డ్రైవర్‌కి కమల్ హాసన్ సాయం.. ఏమి చేశాడో తెలుసా..?
ఇటీవల తమిళనాట తొలి మహిళా బస్సు డ్రైవర్ అయిన షర్మిల ఉద్యోగం కోల్పోవడం అందర్నీ బాధించింది. ఇక దీని పై కమల్ హాసన్ స్పందింస్తూ..

Kamal Haasan gifted car to a Woman Driver Sharmila news viral
Kamal Haasan : తమిళనాట ఇటీవల తొలి మహిళా బస్సు డ్రైవర్‌గా (Woman Driver) ఫేమస్ అయిన ‘షర్మిల’ గురించి వార్తల్లో వినే ఉంటారు. ప్రైవేట్ ట్రావెల్స్ లో బస్సు నడుపుతున్న ఈ డ్రైవర్ ఈమధ్య తన ఉద్యోగం కోల్పోయింది. తమిళ రాజకీయ పార్టీ డీఎంకే (DMK) ఎంపీ కనిమొళి ఇటీవల కోవైలో పర్యటించారు. ఆ సమయంలో షర్మిల నడుపుతున్న బస్సులో ప్రయాణించి ఆమెను ప్రశంసించి ఒక వాచ్ కూడా బహుమతిగా ఇచ్చారు. అయితే ఆ ప్రయాణంలో బస్సులోని కండక్టర్.. ఎంపీని టికెట్ కొనుగోలు చేయాలంటూ కోరింది. ఈ విషయంలో డ్రైవర్ షర్మిల మరియు కండక్టర్ మధ్య వాగ్వాదం జరిగింది.
Allu Sirish : ఇన్నాళ్లు దాచా.. నాలోని అభిమాని వల్ల ఇక కుదరలేదు
ఈ విషయం ట్రావెల్స్ యాజమాన్యం వరకు చేరింది. ఎంపీతో కండక్టర్ తప్పుగా ప్రవర్తించిందని షర్మిల అంటే, తను (షర్మిల) ఫేమస్ అవ్వడానికి సెలబ్రిటీస్ ని బస్సు ఎక్కించి తోటి ప్రయాణకులను ఇబ్బందికి గురి చేస్తుందని కండక్టర్ పిర్యాదు చేసింది. గతంలో కూడా షర్మిల గురించి పలువురు సెలబ్రిటీస్ బస్సు ఎక్కిన సందర్భాలు ఉన్నాయి. వీరిద్దరి వాదనలు విన్న యాజమాన్యం షర్మిలను ఉద్యోగంలో నుంచి తీసేసింది. ఈ విషయం తమిళనాట చర్చనీయాంశం అయ్యింది.
Adipurush : 10 రోజుల్లో ఆదిపురుష్ కలెక్షన్స్ ఎంతంటే..? బ్రేక్ ఈవెన్ కష్టమే అంటున్నారు..!
ఇక ఈ విషయం పై లోకనాయకుడు కమల్ హాసన్ స్పందించాడు. “తొలి మహిళా బస్సు డ్రైవర్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న షర్మిల ఉద్యోగం కోల్పోడం నన్నెంతో బాధకు గురి చేసింది. యువతకు ఎంతో స్ఫూర్తిని కలిగించిన షర్మిల డ్రైవర్ గానే మిగిలిపోకూడదు. మా కమల్ కల్చరల్ సెంటర్ నుంచి ఆమెకు ఒక కారుని అందజేస్తున్నం. క్యాబ్ సర్వీసులకే కాకుండా మరికొంతమందికి ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తగా ఈ కారుని ఉపయోగించుకోవచ్చు. నా ఉద్దేశం ఎంతో మంది షర్మిలలను తయారు చేయడమే” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో నెటిజెన్లు కమల్ కి సలాం అంటున్నారు.