Raju Yadav : గెటప్ శ్రీను సినిమా బాలీవుడ్ స్టార్ హీరో రీమేక్ చేయబోతున్నాడా? ఆ సినిమా అంతా నచ్చిందా?
తాజాగా గెటప్ శ్రీను సినిమా రాజు యాదవ్ గురించి ఓ వార్త వినిపిస్తుంది.

Bollywood hero Rajkummar Rao wants to Remake Getup Srinu Raju Yadav Movie Rumours goes Viral
Raju Yadav : జబర్దస్త్ షోతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న కమెడియన్ గెటప్ శ్రీను టీవీలో సక్సెస్ అయి ఆ తర్వాత సినిమాల్లో కూడా దూసుకుపోతున్నాడు. సినిమాల్లో కమెడియన్ గా బిజీగా ఉన్న గెటప్ శ్రీను ఇటీవల హీరోగా ఒక సినిమా చేసాడు. గెటప్ శ్రీను హీరోగా, అంకిత ఖారత్ హీరోయిన్ గా కొత్త దర్శకుడు కృష్ణమాచారి దర్శకత్వంలో ‘రాజు యాదవ్’ అనే సినిమా వచ్చింది.
క్రికెట్ ఆడుతున్నప్పుడు మూతి మీద బాల్ తగిలి లైఫ్ లాంగ్ నవ్వుతూ ఉండేలా హీరో ఫేస్ మారిపోతుంది. ఆపరేషన్ చేయిస్తే మాములుగా మారుతుంది కానీ డబ్బుల్లేక అలా వదిలేయడంతో ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. అతని నవ్వు వల్ల వచ్చిన సమస్యలు, ఆ నవ్వు వల్ల వచ్చే లవ్ స్టోరీ, ఆ తర్వాత అయ్యే బ్రేకప్.. ఇలా మాములు లవ్ కమర్షియల్ కథకి కొత్త కథనంతో చూపించారు. ఈ సినిమా క్లైమాక్స్ హైలెట్. గెటప్ శ్రీను యాక్టింగ్ కూడా హైలెట్ గా నిలుస్తుంది ఈ సినిమాలో. సినిమా యావరేజ్ గా ఆడినా చిన్న బడ్జెట్ సినిమా కావడం, గెటప్ శ్రీను యాక్టింగ్ వల్ల కమర్షియల్ గా కూడా సక్సెస్ అయింది.
Also Read : Akshay Kumar : అంబానీ ఇంట పెళ్లి సమయంలో బాలీవుడ్‌కి షాక్.. ఆ స్టార్ హీరోకి కరోనా పాజిటివ్..
అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ వార్త వినిపిస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో రాజ్ కుమార్ రావ్ రాజు యాదవ్ సినిమా చూసాడని, ఆ సినిమా అతనికి నచ్చి రీమేక్ చేద్దామనుకుంటున్నాడని బాలీవుడ్ లో వార్తలు వచ్చాయి. రాజ్ కుమార్ రావు ఎక్కువగా ప్రయోగాత్మక సినిమాలే చేస్తాడు. ఇటీవలే శ్రీకాంత్ అనే సినిమాలో అంధుడి పాత్రలో కూడా నటించి మెప్పించాడు. రాజు యాదవ్ సినిమాలో గెటప్ శ్రీను నవ్వుతూనే ఉంటూ అన్ని రకాల ఎమోషన్స్ చూపించడం రాజ్ కుమార్ రావు కి నచ్చి తాను కూడా ఆ ప్రయోగం చేయాలనుకుంటున్నాడట. మరి ఈ వార్త నిజమేనా కాదా అంటే అధికారికంగా చెప్పేదాకా ఎదురుచూడాల్సిందే. ఒకవేళ నిజమే అయితే గెటప్ శ్రీనుకి కూడా బాలీవుడ్ లో ఎంట్రీ దొరుకుతుంది. ఆ డైరెక్టర్ కి కూడా మంచి పేరు వస్తుంది.