Koffee with Karan : విజయ్ దేవరకొండనే కావాలి అంటున్న బాలీవుడ్ హీరోయిన్స్.. రిప్లై ఇచ్చిన రౌడీ హీరో..

తాజాగా కాఫీ విత్ కరణ్ జోహార్ ఏడో సీజన్ డిస్నిప్లస్ హాట్‌స్టార్‌ లో టెలికాస్ట్ అవుతుంది. ఇటీవలే మొదలైన ఈ షోలో సెకండ్ ఎపిసోడ్ కి బాలీవుడ్ స్టార్ కిడ్స్ సారా అలీఖాన్‌, జాన్వి కపూర్‌లు గెస్టులుగా...............

Koffee with Karan :  విజయ్ దేవరకొండనే కావాలి అంటున్న బాలీవుడ్ హీరోయిన్స్.. రిప్లై ఇచ్చిన రౌడీ హీరో..

Jahnvi Kapoor

Updated On : July 14, 2022 / 12:40 PM IST

Vijay Devarakonda :  విజయ దేవరకొండ క్రేజ్ తెలిసిందే. అర్జున్ రెడ్డితో తెలుగులోనే కాదు బాలీవుడ్ లో కూడా క్రేజ్ సంపాదించుకున్నాడు. తన యాటిట్యూడ్ తో, తన స్పీచ్ లతో మరింతమందిని ఆకర్షించాడు. ముఖ్యంగా అమ్మాయిలకి ఫేవరేట్ హీరో అయ్యాడు. సినీ పరిశ్రమలలో హీరోయిన్స్ కి కూడా చాలా మందికి విజయ్ ఫేవరేట్ అయ్యాడు. బాలీవుడ్ లో ఒక్క సినిమా కూడా చేయకుండానే చాలా మంది బాలీవుడ్ తారలకు ఫేవరేట్ అయిపోయాడు ఈ రౌడీ హీరో. ఇప్పటికే చాలా మంది బాలీవుడ్ హీరోయిన్స్ తమకి విజయ్ దేవరకొండ అంటే ఇష్టమని, అతనితో ఒక్క సినిమా అయినా కలిసి నటించాలని పలు ఇంటర్వ్యూలలో చెప్పారు. త్వరలోనే విజయ్ లైగర్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

తాజాగా కాఫీ విత్ కరణ్ జోహార్ ఏడో సీజన్ డిస్నిప్లస్ హాట్‌స్టార్‌ లో టెలికాస్ట్ అవుతుంది. ఇటీవలే మొదలైన ఈ షోలో సెకండ్ ఎపిసోడ్ కి బాలీవుడ్ స్టార్ కిడ్స్ సారా అలీఖాన్‌, జాన్వి కపూర్‌లు గెస్టులుగా వచ్చారు. వీరిద్దరూ మంచి స్నేహితులు కూడా. తాజాగా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేయగా ఇందులో వీరిద్దరూ విజయ్ దేవరకొండ గురించి మాట్లాడటంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ ప్రోమోలో కరణ్ సారాని.. నువ్వు ఎవరితోనైనా డేట్‌కు వెళ్లాలనుకుంటున్నావా? అని అడగడంతో సారా.. విజయ్ దేవరకొండ అని సమాధానం చెప్పింది. వెంటనే నువ్వు కూడా విజయ్‌తోనేనా అని కరణ్ జాన్వీతో అనగా అవును అని సమాధానమిస్తుంది. దీంతో వెంటనే సారా అలీఖాన్‌.. ఏంటీ నువ్వు కూడా విజయ్‌ని ఇష్టపడుతున్నావా? అని జాన్విని ఆశ్చర్యంగా అడిగింది. ఇలా ఇద్దరు హీరోయిన్స్ విజయ్ అంటే ఇష్టమని, విజయ్ తో డేటింగ్ కి వెళ్ళాలి అని ఉందని చెప్పడంతో ఈ ప్రోమో వైరల్ గా మారింది.

Sara Alikhan

 

Akkineni Heros : అన్న వస్తున్నాడు.. తమ్ముడు వస్తాడా??

విజయ్ దేవరకొండ ఈ వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. ”నాపై ఇంతటి అభిమానం చూపిస్తున్న మీకు నా హగ్‌, ప్రేమ పంపిస్తున్నాను” అంటూ పోస్ట్ చేశాడు. దీంతో మరోసారి విజయ్ దేవరకొండ క్రేజ్ బాలీవుడ్ లో ఏ రేంజ్ లో ఉందో అర్ధమవుతుంది. ఈ వీడియోని రౌడీ ఫ్యాన్స్ మరింత షేర్ చేస్తున్నారు.