Akkineni Heros : అన్న వస్తున్నాడు.. తమ్ముడు వస్తాడా??

బంగార్రాజు, లవ్ స్టోరీ తర్వాత నాగచైతన్య జులై 22న థాంక్యూ చెప్పడానికొస్తుంటే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్స్ తర్వాత అక్కినేని అఖిల్ ఏజెంట్ గా ఆగస్టు 12న వస్తున్నాడు. థాంక్యూ నుంచి ఇప్పటికే............

Akkineni Heros : అన్న వస్తున్నాడు.. తమ్ముడు వస్తాడా??

Agent

Akkineni Heros :  బంగార్రాజు, లవ్ స్టోరీ తర్వాత నాగచైతన్య జులై 22న థాంక్యూ చెప్పడానికొస్తుంటే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్స్ తర్వాత అక్కినేని అఖిల్ ఏజెంట్ గా ఆగస్టు 12న వస్తున్నాడు. థాంక్యూ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సాంగ్స్ ఈ సినిమా పైన పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తే, లేటెస్ట్ గా రిలీజ్ అయిన ట్రయిలర్ మంచి అంచనాలని నెలకొల్పింది. నాగచైతన్యతో మనం డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ తెరకెక్కించిన థాంక్యూ సినిమా తన కెరీర్ లోనే సమ్ థింగ్ స్పెషల్ గా ఫీలవతున్న చైతూ తనకు నచ్చిన వాళ్లకి ఇటీవల థాంక్యూ కూడా చెప్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే ఆగస్టు 2020లో అనౌన్స్ అయిన ఈ సినిమా డిసెంబర్ లో రెగ్యులర్ షూట్ స్టార్ట్ అయ్యింది. జులై 22న ప్రేక్షకుల ముందుకు రావడానికి ఫిక్స్ అయిపొయింది.

ఇక అఖిల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అక్కినేని అఖిల్ ఆ తర్వాత హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ లాంటి యూత్ ఫుల్ లవ్ స్టోరీస్ లో నటించి అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. తర్వాత తన పంథా మార్చుకుని, మేకోవర్ పూర్తిగా చేంజ్ చేసి, ఇప్పుడు సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో్ ఏజెంట్ గా వస్తున్నాడు. ఫస్ట్ లుక్ తోనే ఎట్రాక్ట్ చేసిన ఏజెంట్ ఆగస్టు 12న రిలీజ్ అవుతుంది అని చెప్తున్నారు. కానీ ఈ సినిమా ఇంకా షూటింగ్ చివరి దశలోనే ఉంది. నెల రోజుల్లో పోస్ట్ ప్రొడక్షన్స్ చేసి, ప్రమోషన్స్ చేయాలంటే కష్టమే. దీంతో అఖిల్ ఏజెంట్ సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.

Rashmika Mandanna : మరో మూడేళ్ళలో నా ఇల్లు అడివి అయిపోతుంది..

లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాలతో హిట్ కొట్టడంతో అక్కినేని అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. రాబోయే అక్కినేని సినిమాలు వరుసగా వెంట వెంటనే వస్తాయి అనడంతో అక్కినేని అభిమానులు ఖుషి ఫీల్ అయ్యారు,. కానీ చైతన్య థాంక్యూ ఫిక్స్ అయినా అఖిల్ ఏజెంట్ రిలీజ్ కన్ఫర్మ్ కాకపోవడంతో ఒకింత నిరాశకి గురవుతున్నారు అక్కినేని ఫ్యాన్స్. మరి దసరాకి నాగార్జున ఘోస్ట్ సినిమాతో రాబోతున్నాను అని అనౌన్స్ చేశాడు. మరి అది అయినా టైంకి వస్తుందో లేదో చూడాలి.