Rajiv Gandhi Web Series : రాజీవ్‌గాంధీ హత్యపై వెబ్ సిరీస్..
‘సిటీ ఆఫ్ డ్రీమ్స్’ వెబ్ సిరీస్ ఫేం నగేష్ కుకునూర్ దర్శకత్వంలో రాజీవ్ గాంధీ హత్య, దాని తర్వాత, ముందు జరిగిన పరిణామాలని వెబ్ సిరీస్ గా............

Bollywood Planing Rajiv Gandhi Web Series
Rajiv Gandhi Web Series : మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య అప్పట్లో దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. రాజీవ్ గాంధీ హత్యోదంతం, తదనంతర పరిణామాలపై రచయిత అనిరుధ్య మిత్రా ‘నైంటీ డేస్: ది ట్రూ స్టోరీ ఆఫ్ హంట్ ఫర్ రాజీవ్‌గాంధీస్ అసాసిన్’ అనే నవల రాశారు. ఈ బుక్ కూడా బాగా పాపులర్ అయింది. ఇప్పుడు ఈ పుస్తకం ఆధారంగా బాలీవుడ్ లో ఓ వెబ్‌సిరీస్ తెరకెక్కించనున్నారు.
‘సిటీ ఆఫ్ డ్రీమ్స్’ వెబ్ సిరీస్ ఫేం నగేష్ కుకునూర్ దర్శకత్వంలో రాజీవ్ గాంధీ హత్య, దాని తర్వాత, ముందు జరిగిన పరిణామాలని వెబ్ సిరీస్ గా తీయనున్నారు. అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఈ సిరీస్ ని నిర్మించనున్నారు. నిర్మాత సమీర్ నాయర్ మీడియాతో మాట్లాడుతూ.. ”సంచలనం సృష్టించిన రాజీవ్ గాంధీ హత్య, దర్యాప్తు, హంతకులను పట్టుకోవడం.. ఇవన్నీ మనం మనం పత్రికల ద్వారా తెలుసుకున్నాం. ఈ సంఘటలన్నింటినీ ఇప్పుడు దృశ్య రూపంలో తెరకెక్కించబోతున్నాం” అని తెలిపారు.
Ponniyin Selvan 1 Trailer : పొన్నియిన్ సెల్వన్ ట్రైలర్ చూశారా.. బాహుబలికి మించి ఉందిగా..
అయితే ఈ సిరీస్ లో ఎవరెవరు నటిస్తారు, రాజీవ్ గాంధీ పాత్రలో ఎవరు నటిస్తారు లాంటి వివరాలు ఇంకా తెలియచేయలేదు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.