బాలీవుడ్ నిర్మాత రాజ్ కుమార్ బర్జాత్యా  మృతి

  • Published By: veegamteam ,Published On : February 21, 2019 / 06:22 AM IST
బాలీవుడ్ నిర్మాత రాజ్ కుమార్ బర్జాత్యా  మృతి

ముంబై : బాలీవుడ్ ప్రముఖ నిర్మాత..రాజశ్రీ ప్రొడక్షన్స్ అధినేత ..రాజ్ కుమార్ బర్జాత్యా కన్నుమూసారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబాయిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కన్నుమూసారు. ఈ విషయాన్ని ముంబై సినీ వర్గాలు తెలిపాయి. 
 

రాజ్ కుమార్ బర్జాత్యా కుమారుడైన ప్రముఖ దర్శక నిర్మాత సూరజ్ ఆర్ బర్జాత్య  దర్శకత్వంలోనే వచ్చిన‘‘మైనే ప్యార్ కియా’’ తో  సల్మాన్ ఖాన్ ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యాడు. ఇదే సినిమాను తెలుగులో ‘ప్రేమ పావురాలు’గా డబ్ చేస్తే ఇక్కడ కూడా ఓ రేంజ్‌లో హిట్టైయింది. ఆ తర్వాత  వీరి బ్యానర్ రాజశ్రీలో వచ్చిన ‘హమ్ ఆప్ కే హై కౌన్’, ‘ హమ్ సాథ్ సాథ్ హై’, ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ వంటి సినిమాలు తెరకెక్కినుండే ప్రస్తుతం సూరజ్ బర్జాత్య..సల్మాన్‌తో మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను నిర్మించడానికి రెడీ అవుతున్నాడు. ఇక రాజ్ కుమార్ బర్జాత్యా మృతి పట్ల పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు తమ సంతాపాన్ని తెలియజేసారు. 

 

రాజ‌శ్రీ ఫిలిం ప్రొడ‌క్ష‌న్స్‌పై ప్రేమ్ ర‌త‌న్ ధ‌న్‌పాయో( 2015), జానా పెహ్‌చానా(2011), ల‌వ్ యూ.. మిస్టర్ క‌ళాక‌ర్‌(2011), ఇసి లైఫ్ మైనే (2010), ఏక్ వివాహ్‌..ఐసా భాయ్ (2008), షాసు ఘ‌ర చాలిజిబి(2006), వివాహ్ (2006), మైనే ప్రేమ్ కీ దివానీ హూన్‌( 2003), హమ్ ప్యార్ తుమ్హీ సే కార్ బైతే(2002), హ‌మ్ సాత్‌- సాత్ హైన్: వుయ్ స్టాండ్ యునైటెడ్(1999), హ‌మ్ ఆప్‌కే హై కౌన్‌( 1994) చిత్రాల‌ని నిర్మించారు. 1989లో వ‌చ్చిన మైనే ప్యార్ కియా వంటి సూప‌ర్ హిట్ చిత్రానికి అసోసియేట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేశారు.హమ్ ఆప్‌కే హై కౌన్ చిత్రానికి రాజ్‌కుమార్ ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్నారు రాజ్ కుమార్ బర్జాత్యా.