Bollywood News : ఈ ‘వాలంటైన్స్ డే’కి మీరు సింగిలా.. డోన్ట్ వర్రీ అంటున్న బాలీవుడ్ స్టార్

సాధారణమైన రోజుల్లో ఎక్కడ ఉన్నా.. వాలంటైన్స్ డే రోజు మాత్రం ప్రేమ పక్షులు ఒక గూటికి చేరతాయి. ప్రేమికులంతా తమ ప్రేమను సెలబ్రేట్ చేసుకుంటారు. మరి సింగిల్స్ పరిస్థితి ఏంటి? అసలు వర్రీ అవకండి అంటున్నారు కొందరు స్టార్స్.

Bollywood News : ఈ ‘వాలంటైన్స్ డే’కి మీరు సింగిలా.. డోన్ట్ వర్రీ అంటున్న బాలీవుడ్ స్టార్

Bollywood News

Updated On : February 10, 2024 / 11:44 AM IST

Bollywood News : ప్రేమికులంతా ఏటా ఫిబ్రవరి 14న ‘వాలంటైన్స్ డే’ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ సందర్భంలో సింగిల్‌గా ఉన్నవారు కాస్త నిరాశకు లోనవుతారు. సింగిల్‌గా ఉన్నవారిని చింతిచవద్దని చెబుతున్నారు బాలీవుడ్ స్టార్స్. ఒంటరితనాన్ని కూడా ఎంతలా ప్రేమించవచ్చునో సెలవిస్తున్నారు. ఎవరా స్టార్స్?

Siddhu Jonnalagadda : డీజే టిల్లు బర్త్‌డే పార్టీలో మెరిసిన టాలీవుడ్ తారలు..

ఏటా ఫిబ్రవరి 14 రాగానే ప్రేమికులంతా గ్రీటింగ్స్, గిఫ్ట్స్ ఇచ్చి పుచ్చుకుంటారు. వాలెంటైన్స్ డేకి  తమ పార్టనర్ పట్ల ప్రేమను చాటుకుంటారు. అయితే ఒంటరిగా ఉన్నవారు మాత్రం కాస్త బాధపడుతుంటారు. ఒంటరిగా ఉన్నందుకు చింతించవద్దు అంటున్నారు కొందరు బాలీవుడ్ స్టార్స్. వారు కూడా సింగిల్సే. సింగిల్‌గా ఉండటం వల్ల ప్రయోజనాలు కూడా చెప్పారు. నటి టబు సింగిల్‌గా ఉండటం తప్పేమీ కాదు అన్నారు. ఖచ్చితంగా ఒక భాగస్వామి ఉండాలి అనేది ఒకప్పటి మాటని.. ఇప్పుడలా లేదని సంతోషం అనేది అనేక విషయాల్లో దొరుకుతుందని.. కేవలం భాగస్వామి ఉండటమే సంతోషం కాదని అన్నారు. అర్ధం చేసుకోలేని భాగస్వామితో ఉంటూ ఒంటరిగా ఉండటం అంత దురదృష్టం ఇంకొకటి లేదని టబు చెప్పారు.

బాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ తన సింగిల్ స్టేటస్‌ను ప్రేమిస్తున్నానని చెప్పారు. తనకు పెళ్లి లేదా గాళ్ ఫ్రెండ్ పట్ల ఆసక్తి లేవని అన్నారు. ఒంటరిగా ఉండటం వల్ల తను చేయాలనుకున్నది చేస్తానని.. ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని, లేదా అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా లేదని చెప్పారు. గతంలో నటుడు అక్షయ్ ఖన్నా కూడా సింగిల్‌గా ఉండటం వల్ల తాను అసలు ఏది మిస్ కావడం లేదని చెప్పారు. తాను ప్రేమబంధంలో ఉండగలను కానీ..నెలలో 24 గంటలు, 30 రోజులు ఆ బంధమనే చట్రంలో ఉండలేను అని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఎలా జీవిస్తారో తనకు తెలియదు కానీ తనకు అలా ఉంటే ఊపిరాడదని చెప్పారు.

Eagle Collections : రవితేజ ‘ఈగల్’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా?

బ్రిటిష్ నటి ఎమ్మా వాట్సన్ కూడా గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఒంటరిగా ఉండటంలోనే సంతోషంగా ఉన్నానని చెప్పారు. తనకు తాను తోడుగా ఉండటాన్ని ప్రేమిస్తానని చెప్పారు. నటి జెన్నిఫర్ అనిస్టన్ కూడా ఒంటరితనాన్ని ఎంతో సంతోషంగా గడుపుతానని చెప్పారు. ఖచ్చితంగా ఒక పార్టనర్, లేదా పిల్లలు ఉండాల్సిన అసవరం లేదని స్పష్టం చేశారు. సో ఇలా కొందరు సినీ సెలబ్రిటీలు సింగిల్స్‌గా ఉంటూ కూడా సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు. కారణాలేమైనా కానీ ఈ ఒంటరితనమే తమకు నచ్చిందని చెబుతున్నారు.