స్టార్ హీరోల మధ్య బాండింగ్ మంచిదేగా.. కంగ్రాట్స్ బావ..

  • Published By: vamsi ,Published On : January 13, 2020 / 02:03 AM IST
స్టార్ హీరోల మధ్య బాండింగ్ మంచిదేగా.. కంగ్రాట్స్ బావ..

Updated On : January 13, 2020 / 2:03 AM IST

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా హీరోలు, నందమూరి హీరోలకు ఉండే అభిమానులు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరి సినిమాలు వస్తున్నాయంటే చాలు అభిమానులు హడావుడి మాములుగా ఉండదు.. వాళ్ల మధ్య రైవల్రీ కూడా ఆఫ్ లైన్‌లో, ఆన్ లైన్లో అలానే ఉంటది. అయితే ఇటీవలికాలంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య బాండింగ్ ఆ హద్దులను చెరిపేసింది. అయితే ఇప్పుడు లేటెస్ట్‌గా అల.. వైకుంటపురములో సినిమా గురించి ఎన్టీఆర్ వేసిన ట్వీట్ అభిమానులను ఆకట్టుకుంటుంది. 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమాను యంగ్ టైగర్ ఎన్టీఆర్ చూశారు. సినిమా చూడటమే కాదు రివ్యూ కూడా ఇచ్చారు. సినిమాపై తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘బావ కంగ్రాట్స్’ అంటూ అల్లు అర్జున్‌ని ఉద్ధేశించి ప్రశంసల వర్షం కురిపించారు. అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఒకరినొకరు బావ అనిపిలుచుకుంటారు. బన్నీ చాలా సార్లు ‘మా బావ తారక్’ అని సంబోధించారు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా అలాగే పిలుస్తూ ట్వీట్ వెయ్యడంతో స్టార్ హీరోల మధ్య ఇటువంటి బాండింగ్ మంచిదేగా.. అంటూ ట్వీట్ చేస్తున్నారు అభిమానులు.

ఇక ఎన్టీఆర్ రివ్యూ విషయానికి వస్తే.. ‘‘అల్లు అర్జున్ అద్భుతమైన నటన, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి మహాద్భుతమైన రచన ‘అల వైకుంఠపురములో’ సినిమాని గొప్ప సినిమా అయ్యేలా చేశాయి. బావ, స్వామికి అభినందనలు. అలాగే, వీళ్లకి దన్నుగా అద్భుతంగా నటించిన మురళీ శర్మ గారికి ధన్యవాదాలు. తమన్ అందించిన అద్భుతమైన సంగీతం సినిమాకు ప్రధాన బలం. పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఇంత మంచి సినిమాను అందించినందుకు హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌తో పాటు చిత్ర యూనిట్ మొత్తానికి అభినందనలు’’ అని ఎన్టీఆర్ ట్వీట్‌ చేశారు. ఇందులో బావ అంటే అల్లూ అర్జున్ కాగా.. స్వామీ అంటే త్రివిక్రమ్. ఎన్టీఆర్ ట్వీట్‌కు అల్లు అర్జున్ కూడా స్పందించారు. ‘‘బావా! థాంక్యూ వెరీ మచ్. నీతో మాట్లాడుతుంటే చాలా బాగుంటుంది. త్వరలోనే కలుద్దాం’’ అంటూ ట్వీట్‌లో చేశారు.