Rajendra Prasad – Brahmanandam : రాజేంద్రప్రసాద్‌ని ఓదారుస్తూ బ్రహ్మానందం ఎమోషనల్.. ఆమెకు నివాళులు అర్పిస్తూ..

బ్రహ్మానందం రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రికి నివాళులు అర్పించి రాజేంద్రప్రసాద్ ని హత్తుకొని ఓదార్చారు.

Rajendra Prasad – Brahmanandam : రాజేంద్రప్రసాద్‌ని ఓదారుస్తూ బ్రహ్మానందం ఎమోషనల్.. ఆమెకు నివాళులు అర్పిస్తూ..

Brahmanandam Offers Condolence to Rajendraprasad Daughter

Updated On : October 6, 2024 / 8:04 AM IST

Rajendra Prasad – Brahmanandam : నటుడు రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి నిన్న గుండెపోటుతో మరణించారు. దీంతో సినీ ప్రముఖులంతా ఆమె నివాసానికి వెళ్లి నివాళులు అర్పించారు. కూతురు మరణించడంతో విషాదంలో మునిగిపోయిన రాజేంద్ర ప్రసాద్ ని ప్రముఖులంతా ఓదార్చారు. ఈ క్రమంలో బ్రహ్మానందం కూడా రాజేంద్రప్రసాద్ కూతురుకు నివాళులు అర్పించడానికి వెళ్లారు.

Also Read : Rajendra prasad : రాజేంద్రప్ర‌సాద్‌ను ప‌రామ‌ర్శించిన అల్లు అర్జున్‌

బ్రహ్మానందం నిన్న రాత్రి రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రికి నివాళులు అర్పించి రాజేంద్రప్రసాద్ ని హత్తుకొని ఓదార్చారు. ఈ క్రమంలో బ్రహ్మానందం కూడా ఎమోషనల్ అయ్యారు. బ్రహ్మానందంతో పాటు అయన కొడుకు గౌతమ్, కమెడియన్ వెన్నెల కిషోర్ వచ్చారు. కాసేపు అక్కడే ఉండి రాజేంద్రప్రసాద్ ని పరామర్శించి వెళ్లారు. దీంతో బ్రహ్మానందం రాజేంద్రప్రసాద్ ని ఓదారుస్తున్న వీడియోలు వైరల్ గా మారాయి.

ఇక రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి అంత్యక్రియలు నేడు కూకట్ పల్లి కైలాసవాసంలో ఉదయం 9-30 గంటలకు జరగనున్నాయి.