Bro Movie : సినిమాకి బ్రో అనే టైటిల్ ఎలా వచ్చిందో తెలుసా..? అమెరికాలో ఈ మూవీ కొనడానికి బయ్యర్లు ఎవరు రాలేదా..?
బ్రో అనే టైటిల్ ఎలా వచ్చిందో తెలుసా..? అలాగే అమెరికాలో ఈ మూవీ కొనడానికి బయ్యర్లు ఎవరు రాలేదని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దాని పై నిర్మాత రియాక్షన్ ఏంటి..?
![Bro Movie : సినిమాకి బ్రో అనే టైటిల్ ఎలా వచ్చిందో తెలుసా..? అమెరికాలో ఈ మూవీ కొనడానికి బయ్యర్లు ఎవరు రాలేదా..? Bro Movie : సినిమాకి బ్రో అనే టైటిల్ ఎలా వచ్చిందో తెలుసా..? అమెరికాలో ఈ మూవీ కొనడానికి బయ్యర్లు ఎవరు రాలేదా..?](https://10tv.in/wp-content/uploads/2023/07/Bro-Movie-producer-about-title-and-overseas-distributors-rumours.jpg)
Bro Movie producer about title and overseas distributors rumours
Bro Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కలయికలో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్దమయిన మూవీ ‘బ్రో’. సోషియో ఫాంటసీ నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రం తమిళంలో హిట్ అయిన ‘వినోదయ సిత్తం’కి రీమేక్ గా వస్తుంది. తమిళ్ లో దర్శకత్వం వహించిన సముద్రఖనినే తెలుగులో కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ మూవీ ఈ నెల 28న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. దీంతో ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాత టి జి విశ్వ ప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
Samuthirakani : తెలుగుతో పాటు 12 భాషల్లో బ్రో సినిమా రీమేక్.. సాయిధరమ్‌తో సముద్రఖని మరో మూవీ..
ఇక ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను ఆడియన్స్ తో పంచుకున్నారు. ఈ క్రమంలోనే ఈ మూవీకి ‘బ్రో’ అనే టైటిల్ ఎలా వచ్చిందో తెలియజేశారు. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్ ని బ్రో అని పిలుస్తుంటాడట. అందుకనే ఈ మూవీ ఆ టైటిల్ పెట్టినట్లు వెల్లడించారు. అలాగే ఓవర్సీస్ లో ఈ మూవీని కొనడానికి బయ్యర్లు ఎవరు రాలేదనే వార్తలు పై కూడా రియాక్ట్ అయ్యారు.
Sai Dharam Tej : విరూపాక్షతో పెళ్లి పై హోప్ వచ్చింది.. కానీ Bro తో అది పూర్తిగా పోయింది..
“పవన్ కళ్యాణ్ సినిమాలు కొనడానికి బయ్యర్లు రాలేదనే మాటే అసలు ఉండదు. ఇప్పటికిప్పుడు హక్కులు ఇస్తామని ప్రకటిస్తే తీసుకోవడానికి ఎంతోమంది పోటీ పడతారు. ఇక ఈ సినిమా ఓవర్సీస్ హక్కులను మీమే ఎవరికీ ఇవ్వలేదు. ఈ మూవీ పై మాకున్న నమ్మకంతో సొంతంగా విడుదల చేయాలని అనుకున్నాం” అంటూ తెలియజేశారు. దీంతో మూవీ కొనడానికి బయ్యర్లు రాలేదన్న రూమర్స్ కి చెక్ పడింది. ఇక ఈ సినిమాని రీమేక్ చేస్తే బాగుంటుందని త్రివిక్రమే సజెస్ట్ చేసినట్లు కూడా నిర్మాత వెల్లడించారు.