NTR : అమెరికాలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టకుండా కొందరు అడ్డుకోవాలని చూస్తున్నారు.. Bro మూవీ నిర్మాత విశ్వప్రసాద్!

నందమూరి తారక రామారావు శత జయంతి కార్యక్రమంలో భాగంగా అమెరికాలో విగ్రహావిష్కరణ చేస్తామంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ విగ్రహావిష్కరణ జరగలేదు. దానిని..

NTR : అమెరికాలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టకుండా కొందరు అడ్డుకోవాలని చూస్తున్నారు.. Bro మూవీ నిర్మాత విశ్వప్రసాద్!

Bro movie producer TG Vishwaprasad viral comments on NTR statue in america

100 Years of NTR : నందమూరి తారక రామారావు శత జయంతి ఈ ఏడాది జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మే 28న జరిగిన ఈ కార్యక్రమాన్ని క్రిందట ఏడాది మే 28 నుంచి ‘శకపురుషుని శత జయంతి ఉత్సవాలు’ పేరిట సంవత్సరం పాటు శతజయంతిని ఘనంగా చేసుకుంటూ వచ్చారు. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రమంలోనే అమెరికా, ఖతార్ మరియు ఇతర దేశాల్లో కూడా శతజయంతి వేడుకలు జరిగాయి.

Shah Rukh Khan : బాలీవుడ్‌ ఇతర హీరోల దగ్గర లేనివి తన దగ్గర ఉన్నవి అవే అంటున్న షారుఖ్.. ట్వీట్ వైరల్!

ఇక ఉత్సవంలో భాగంగానే.. అమెరికాలో ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నట్లు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ అధినేత టి జి విశ్వప్రసాద్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఆవిష్కరణ ఎందుకో జరగలేదు. దీని గురించి కూడా ఇప్పటి వరకు ఎవరు వివరణ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విశ్వప్రసాద్.. విగ్రహావిష్కరణ గురించి సంచలన కామెంట్స్ చేశారు.

అమెరికా న్యూజెర్సీ ఎడిసన్ సిటీలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టడానికి అక్కడ మేయర్ అనుమతి కూడా తీసుకున్నారని కానీ కొందరు దానిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అందుకే మేలో విగ్రహం ఏర్పాటు చేయలేకపోయినట్లు, త్వరలోనే విగ్రహావిష్కరణ జరిగేలా సన్నాహాలు చేస్తున్నట్లు తెలియజేశారు. ఇక ఈ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. తెలుగు ఆత్మగౌరవానికి ప్రతీక అయిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణను అడ్డుకునే వారు ఎవరని ఆరా తీస్తున్నారు తెలుగు ప్రేక్షకులు, ఎన్టీఆర్ అభిమానులు.

Adipurush : తెలుగు తెర పై శ్రీరాముడిగా కనిపించిన నటులు.. వెండితెరపై మొదటి రాముడు ఎవరో తెలుసా?

కాగా అమెరికా న్యూజెర్సీ ఎడిసన్ సిటీలోని నాయకులు.. ఆ ప్రాంతంలో ప్రపంచంలోని గొప్ప గొప్ప నాయకుల విగ్రహాలని స్థాపించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో అక్కడ ఎన్టీఆర్ విగ్రహాన్ని స్థాపించాలని నార్త్ అమెరికా సీమాంధ్ర అసోసియేషన్ తరపున విశ్వప్రసాద్ ఎడిసన్ సిటీ మేయర్ సామ్ జోషికి ప్రతిపాదించారు. ఇక అమెరికాలో ఇప్పటి వరకు ఒక తెలుగువాడి విగ్రహం పెట్టిన చరిత్ర లేదు. దీంతో ఈ విగ్రహావిష్కరణను తెలుగు ప్రజలు ఎంతో గౌరవంగా భావిస్తున్నారు.