Jungkook: 60లక్షల మంది లైవ్‌లో ఉండగా బీటీఎస్ స్టార్ ఏం చేశాడో తెలిస్తే షాక్..
బీటీఎస్(Bangtan Boys) గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. దక్షిణకొరియా కు చెందిన పాపులర్ మ్యూజిక్ బ్యాండ్ ఇది. ఈ బ్యాండ్ సభ్యుడు జంగ్‌కుక్ అప్పుడప్పుడు తన సోషల్ మీడియా వేదికగా లైవ్ సెషన్స్ నిర్వహిస్తుంటాడు.

Jungkook
BTS Jungkook: సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి స్టార్స్‌కు అభిమానులకు మధ్య దూరం తగ్గిపోయింది. చాలా మంది నటీ, నటులు తమ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అవుతున్నారు. వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ తమ కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన విషయాలను పంచుకుంటున్నారు. లైవ్ సెషన్స్ నిర్వహించేటప్పుడు ఎంతో జాగ్రత్త ఉండాల్సిందే. ఏ మాత్రం కాస్త అటు ఇటు అయినా పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొవాల్సి వస్తుంది. అలాగే ఓ స్టార్ సోషల్ మీడియాలో అభిమానులతో లైవ్ సెషన్ చేస్తూ నిద్రపోయాడు.
బీటీఎస్(Bangtan Boys) గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. దక్షిణకొరియా కు చెందిన పాపులర్ మ్యూజిక్ బ్యాండ్ ఇది . జంగ్‌కుక్( Jungkook), ఆర్‌ఎం(RM), వి(V), జిమిన్(Jimin), జిన్( Jin), జె హోప్(J-Hope), సుగా(Suga) అనే ఏడుగురితో కూడిన బ్యాండ్ ఇది. ఈ బ్యాండ్ ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ పొందింది. వీరి నుంచి ఎన్నో సూపర్ హిట్స్ సాంగ్స్ వచ్చాయి. ‘బటర్’, ‘ఫేక్ లవ్’, ‘ఐడల్’ వంటి సాంగ్స్ వల్ల మిలియన్లలో ఈ బ్యాండ్‌కు అభిమానులున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ బ్యాండ్ సభ్యుడు జంగ్‌కుక్ అప్పుడప్పుడు తన సోషల్ మీడియా వేదికగా లైవ్ సెషన్స్ నిర్వహిస్తుంటాడు. అలాగే ఈ సారి ఆదివారం(దక్షిణ కొరియా టైమ్ ప్రకారం) ఉదయం 7 గంటల సమయంలో లైవ్‌లోకి వచ్చాడు. బెడ్‌పై ఉన్న అతడు కాసేపు అభిమానులతో పిచ్చాపాటిగా మాట్లాడాడు. అయితే సడెన్‌గా నిద్రపోయాడు. ఆ సమయంలో లైవ్‌లో 60 లక్షల మందికి పైగా అభిమానులు ఉన్నారు. ఇలా ఒకటి కాదు రెండు ఏకంగా 21 నిమిషాల పాటు అతడు నిద్రించాడు. అంత సేపు లైవ్ అలాగే కొనసాగింది.
A cute summary of Jungkook’s Weverse live today ? pic.twitter.com/ClYzDtCGKc
— ????∞⁷? (@_RapperJK) June 12, 2023
Prabhas : ప్రభాస్, మారుతి సినిమా గురించి క్లారిటీ ఇచ్చిన నిర్మాత.. రిలీజ్ డేట్!
అతడు నిద్రపోతున్న వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇంకేముంది కామెంట్లతో సోషల్ మీడియా హోరెత్తింది.#JUNGKOOK హ్యాష్‌ట్యాగ్‌పై 8,90,000 ట్వీట్లు వచ్చాయి.
[full] 21 minutes of jungkook sleeping on his live ? pic.twitter.com/5olFcuO0LN
— jk vids ? (slow) (@jjklve) June 12, 2023