Bujji and Bhairava Trailer : ‘బుజ్జి అండ్ భైరవ’ యానిమేషన్ సిరీస్ ట్రైలర్.. బ్రహ్మానందం కూడా ఉన్నాడుగా..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం కల్కి 2898 AD.

Bujji and Bhairava Trailer
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘కల్కి 2898 AD’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ప్రభాస్ భైరవ పాత్రలో నటిస్తుండగా అతడికి తోడుగా బుజ్జి అనే రోబోటిక్ కారు ఉండనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం ఇటీవల బుజ్జి వెహికల్‌ను పరిచయం చేశారు.
కాగా.. ఈ సినిమా విడుదల కంటే ముందుగా బుజ్జిని చూడొచ్చు. బుజ్జి అండ్ భైరవ పేరుతో ఓ యానిమేషన్ సిరీస్ ను రూపొందించారు. ఈ యానిమేషన్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో మే 31 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా ఈ సిరీస్ తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌లో బుజ్జి, భైరవలు కలిసి ప్రత్యర్థుల పని పట్టారు. మొత్తంగా ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
Producer Suryadevara Radhakrishna : సినీ పరిశ్రమలో విషాదం.. స్టార్ నిర్మాత తల్లి కన్నుమూత..