Vinaya Prasad : ప్రముఖ సీనియర్ ఆర్టిస్ట్ ఇంట్లో దొంగతనం.. బంగారం, నగదు మాయం..
ఇటీవల దీపావళికి వినయ ప్రసాద్ ఆమె కుటుంబంతో కలిసి ఊరు వెళ్ళింది. ఇదే సమయం అనుకోని ముందు నుంచి కాపు కాసిన దొంగలు ఆమె ఇంట్లోనుంచి........

Burglary in the house of a famous senior artist
Vinaya Prasad : ఒకప్పుడు హీరోయిన్ గా నటించి ప్రస్తుతం తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటిస్తున్నారు వినయ ప్రసాద్. తెలుగులో ఇంద్ర, ఆడవారి మాటలకి అర్దాలే వేరులే, ఆంజనేయులు, రెడీ, అదుర్స్, సరైనోడు లాంటి చాలా సినిమాల్లో అమ్మ, అత్త క్యారెక్టర్స్ పోషించింది. ప్రస్తుతం ఆమె బెంగుళూరులో తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటుంది.
BiggBoss 6 Day 57 : ఈ వారం నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారో తెలుసా??
ఇటీవల దీపావళికి వినయ ప్రసాద్ ఆమె కుటుంబంతో కలిసి ఊరు వెళ్ళింది. ఇదే సమయం అనుకోని ముందు నుంచి కాపు కాసిన దొంగలు ఆమె ఇంట్లోనుంచి నగదు, బంగారం ఎత్తుకెళ్లారు. ఊరి నుంచి వచ్చి చూసిన వినయ ప్రసాద్ తమ ఇంట్లో దొంగతనం జరిగి డబ్బు, బంగారం పోయిందని గ్రహించింది. దీంతో బెంగుళూరు పోలీసులకి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఎంతమేరకు నగదు, బంగారం పోయింది అనే వివరాలు మాత్రం బయటకి రాలేదు.