Release Clash: సినిమాకి రిలీజ్ డేట్ దొరకట్లే.. ఫుల్ స్ట్రెస్‌లో మేకర్స్!
కోవిడ్ తో పోస్ట్ పోన్ అయ్యి రిలీజ్ కు రెడీగా ఉన్న సినిమాలు ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ లేటయ్యిందని టెన్షన్ పడుతున్న నిర్మాతలకు, రిలీజ్ క్లాష్ మరో పెద్ద..

Release Clash
Release Clash: కోవిడ్ తో పోస్ట్ పోన్ అయ్యి రిలీజ్ కు రెడీగా ఉన్న సినిమాలు ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ లేటయ్యిందని టెన్షన్ పడుతున్న నిర్మాతలకు, రిలీజ్ క్లాష్ మరో పెద్ద ప్రాబ్లమ్ అయిపోయింది. అలా పెద్ద సినిమాలు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చెయ్యడంతో మిగిలిన సినిమాలు కూడా డేట్స్ మార్చుకుంటున్నాయి. లేటెస్ట్ గా రీషెడ్యూల్ అయిన సినిమాలేంటో డీటెయిల్డ్ గా చూద్దాం.
Film Release Clash: మహేష్-చిరు.. తగ్గేది ఎవరు.. వచ్చేది ఎవరు?
ఇప్పటికే రిలీజ్ లేటయిందని ఒక పక్క, అసలు రిలీజ్ డేట్ ఎప్పుడో తెలీక ఒకపక్క ఫుల్ స్ట్రెస్ ఫీలవుతున్నారు. రిలీష్ క్లష్ తో ఇప్పటికే.. చాలా సినిమాలు రీషెడ్యూల్ అయ్యాయి. భీమ్లానాయక్ ఈ ఫిబ్రవరి 25న రిలీజ్ అనౌన్స్ చెయ్యడంతో ఇదే డేట్ కి రిలీజ్ అనౌన్స్ చేసిన సినిమాలు రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకున్నాయి. గని మూవీ ఫిబ్రవరి 25న రిలీజ్ అని చెప్పింది.. కానీ భీమ్లా రావడంతో అసలు రిలీజ్ ఎప్పుడో కూడా తెలీని డైలమాలో పడిపోయింది వరుణ్ తేజ్ గని.
Film Release Clash: సౌత్ వర్సెస్ నార్త్, నీ ప్రతాపమో.. నా ప్రతాపమో!
ఫిబ్రవరి 25నే రిలీజ్ అనౌన్స్ చేసిన శర్వానంద్ ఆడవాళ్లూ మీకుజోహార్లు సినిమా కూడా రిలీజ్ రీ షెడ్యూల్ చేసుకుంది. మరో వారం రోజుల్లో సినమా రిలీజ్ అని ప్రమోషన్లు కూడా మొదలుపెట్టిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్.. తీరా భీమ్లా రంగంలోకి దిగడంతో వేరేదారి లేక సినిమా పోస్ట్ పోన్ చేసుకుని మార్చి 4న రిలీజ్ కు రెడీ అవుతోంది.
OTT Release Clash: నువ్వా.. నేనా.. ఓటీటీల్లోనూ రిలీజ్ వార్
పెద్ద సినిమాల మధ్య ఎందుకులే అని రిలీజ్ రీషెడ్యూల్ చేసుకున్న మరో సినిమా సెబాస్టియన్ పిసి 524. కిరణ్ అబ్బవరం ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్ తో ఎమోషనల్ గా తెరకెక్కించిన ఈ సెబాస్టియన్ మూవీ కూడా ముందు రిలీజ్ ఫిక్స్ చేసుకున్న ఫిబ్రవరి 25 నుంచి మార్చి 4 కు షిఫ్ట్ అయ్యింది. పవన్ కళ్యాణ్ సినిమా రోజు నా సినిమా రిలీజ్ చెయ్యనని ముందే చెప్పిన కిరణ్.. అన్నమాట ప్రకారం తన సినిమా రిలీజ్ రీషెడ్యూల్ చేసుకున్నారు.
Release Clashes: ఇండియన్ సినిమాకి పాన్ ఇండియా ప్రాబ్లమ్స్..!
మేజర్ కూడా రీషెడ్యూల్ అయ్యింది. అడవి శేష్ ముంబై పేలుళ్ల లో చనిపోయిన మేజర్ ఉన్నికృష్ణన్ లైఫ్ స్టోరీ ఆధారంగా తరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ మేజర్.. వన్ ఇయర్ నుంచి పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. ఫైనల్ గా ఈ నెల 11న రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇప్పుడు ఏకంగా సమ్మర్ లో మే 27న రీషెడ్యూల్ అయ్యింది.
Telugu Film Release Clash: ఎక్కువైపోయిన సినిమాల స్టాక్.. థియేటర్లేమో లేవాయే!
ప్రభాస్.. ఆదిపురుష్ సినిమా కూడా రీషెడ్యూల్ కాబోతోంది. ఎందుకంటే.. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ సినిమా లాల్ సింగ్ చద్దా ఆగస్ట్ 11న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. నిజానికి ఆగస్ట్ 11 ప్రభాస్ ఆదిపురుష్ ని రిలీజ్ చేస్తున్నట్టు సినిమా స్టార్ట్ అయినప్పుడే అనౌన్స్ చేశారు. అయితే లేటస్ట్ గా అమీర్ ఖాన్ కి లైన్ క్లియర్ చెయ్యడంతో ఆదిపురుష్ కూడా రీషెడ్యూల్ చేసినట్టే.