ప్రియాంక రెడ్డి ఘటన – ట్రెండ్ అవుతున్న ఎన్టీఆర్ ఫోటోలు

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసును సైబరాబాద్ పోలీసులు చేధించారు. ఈ కేసులో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు ఈ దుశ్చర్యను ఖండిస్తూ RIPPriyankaReddy అనే హ్యాష్‌ట్యాగ్‌తో సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.
ప్రియాంక రెడ్డి హత్యాచారం నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమా పోస్టర్లు, వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. తారక్ నటించిన ‘రాఖీ’, ‘టెంపర్’ సినిమాల్లో సమాజంలో మహిళల పట్ల జరుగుతున్న దారుణాలను కళ్లకి కడుతూ, నిందితులకు శిక్ష పడడం సబబు అనే అంశాలను తెలియచెప్పిన సంగతి తెలిసిందే.
ఆ సన్నివేశాల్లో ఎన్టీఆర్ నటన అద్భుతంగా ఉంటుంది.. ‘సమాజంలో ఆడవాళ్లపై జరుగుతున్న దారుణాలను ఎన్టీఆర్ సినిమాల్లో చూపించాడు.. ‘రాఖీ’ డైరెక్టర్ కృష్ణవంశీ, ‘టెంపర్’ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌లకు థ్యాంక్స్’.. ‘సొసైటీ నీడ్స్ దిస్ గయ్ బ్యాడ్లీ’ అంటూ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
#RIPPriyankaReddy pic.twitter.com/rO2jfCwkf3
— Vikram M (@mrpablohigh) November 28, 2019