మెగాస్టార్ సి.సి.సి. సంస్థకు వెల్లువెత్తుతున్న విరాళాలు..

కరోనా ఎఫెక్ట్ : మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ ఛారిటీకి భారీగా విరాళాలు..

  • Published By: sekhar ,Published On : March 30, 2020 / 02:31 PM IST
మెగాస్టార్ సి.సి.సి. సంస్థకు వెల్లువెత్తుతున్న విరాళాలు..

Updated On : March 30, 2020 / 2:31 PM IST

కరోనా ఎఫెక్ట్ : మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ ఛారిటీకి భారీగా విరాళాలు..

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రజలను వణికిస్తోన్న కరోనా వ్యాధిని అడ్డుకోవడానికి అన్ని దేశాలతో పాటు మన దేశాన్ని కూడా 21 రోజులు లాకౌట్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీని వలన ఇబ్బందులు పడుతున్న టాలీవుడ్ సినీ కార్మికుల సంక్షేమం కోసం తెలుగు సినీ పరిశ్రమ ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ ఛారిటీకి హీరోలు అందరూ విరాళాలు అందిస్తున్నారు.
ఇక ఇప్పటికే రూ.1.25 కోట్లు కరోనా బాధితులకు తనవంతు సాయం అందించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, కరోనా విపత్తు నిధికి మరొక రూ.20 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో మొత్తంగా బన్నీ రూ.1.45 కోట్లు విరాళం అందించడం జరిగింది. ఈ విధంగా మంచి మనసుతో ప్రజలను ఆదుకుంటున్న సినిమా ప్రముఖులపై పలువురు ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

కరోనా మహమ్మారిపై యుద్ధానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని హీరో నారా రోహిత్ పిలుపునిచ్చారు. ఈ పోరాటంలో త‌న వంతుగా రూ. 30 ల‌క్ష‌ల విరాళాన్ని ప్ర‌క‌టించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధుల‌కు చెరో రూ.10 లక్షలు, ప్రధాన మంత్రి సహాయ నిధికి మరో రూ.10 లక్షలు విరాళంగా ఇస్తున్న‌ట్లు తెలిపారు. మరో యువ నటుడు సుశాంత్ కూడా తనవంతు సాయమందించడానికి ముందుకొచ్చారు.

Read Also : లిప్‌లాక్‌లో తప్పేముంది.. ఎవరో ఒకరు రాజీపడాల్సిందే..

“ఇవి ఒక‌రినొక‌రు చూసుకోవాల్సిన రోజులు. ఈ సంక్షోభ స‌మ‌యంలో దిన‌స‌రి వేత‌నంతో జీవ‌నం సాగించే సినీ కార్మికుల‌ను ఆర్థికంగా ఆదుకోవ‌డానికి నా వంతు చిన్న సాయంగా రూ. 2 ల‌క్ష‌లు క‌రోనా క్రైసిస్ చారిటీకి  విరాళం అంద‌జేస్తాన‌ని విన‌మ్రంగా తెలియ‌జేస్తున్నా. అంద‌రూ త‌మ త‌మ ఇళ్ల‌ల్లో సుర‌క్షితంగా ఉండాల్సిందిగా కోరుతున్నా” అని ట్వీట్ చేశారు. ఇక షైన్ స్క్రీన్స్ బ్యానర్ అధినేతలు సాహు గారపాటి, హరీష్ పెద్ది రూ. 5 లక్షల విరాళం ప్రకటించారు.

మరో యువ నటుడు సందీప్ కిష‌న్ రూ. 3 ల‌క్ష‌లు విరాళంగా ప్ర‌క‌టించారు. దీంతో పాటు ‘వివాహ భోజ‌నంబు’ రెస్టారెంట్ల‌లో ప‌నిచేస్తున్న 500కు పైగా ఉద్యోగుల బాగోగుల‌ను సైతం ఆయ‌న చూసుకుంటున్నారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి ప్ర‌స్తుతం కీల‌క ద‌శ‌లో ఉంద‌నీ, దీన్ని స‌మ‌ర్థంగా ఎదుర్కోవ‌డానికి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అమ‌ల్లోకి తెచ్చిన లాక్‌డౌన్‌ను అంద‌రూ గౌర‌వించాల‌నీ, వైద్యులు, పోలీసుల సూచ‌న‌ల‌ను పాటిస్తూ, అంద‌రూ త‌మ ఇళ్ల‌కే ప‌రిమిత‌మై ఆరోగ్యాన్ని కాపాడుకోవాల‌నీ సందీప్ కిష‌న్ కోరారు. అలాగే తెలుగు సినిమాటోగ్రాఫర్స్ అసోసియేషన్ 50 వేల రూపాయలు విరాళమిస్తున్నట్లు సినిమాటోగ్రాఫర్స్ సమీర్ రెడ్డి, ప్రసాద్ మూరెళ్ల ప్రకటించారు.